Megastar Movie: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు నిర్మాతలు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జనవరి 7, 2026న సాయత్రం 5:30 జరగనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా మరింత బజ్ క్రియేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో రోల్ చేస్తుండటంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ఏం చెప్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Allu Arjun: ప్లాప్ వచ్చిన తర్వాత బన్నీ చేసేది ఇదే.. అందుకే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..
సెన్సార్ పూర్తి..
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Read also-NTR viral video: అభిమానులపై సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే?
నిడివి ఎంతంటే?
సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో, యాక్షన్‌తో అలరించనున్నారని అంటున్నారు. చివరిలో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా రచ్చ రచ్చగా ఉంటుందని, ఒక్కొక్కళ్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారని, అనిల్ రావిపూడి ఈసారి కామెడీ డోస్ కాస్త పెంచినట్లుగా టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 162 నిమిషాలు, అంటే 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది. మొత్తంగా అయితే సెన్సార్ టాక్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉందని మాత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి హిట్ ఎంత అవసరమో తెలియంది కాదు. ‘భోళా శంకర్’ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుంటారని, ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అనిల్ రావిపూడికి ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా రాకపోవడంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
All set for a grand evening of celebrations and entertainment❤️🔥#ManaShankaraVaraPrasadGaru MEGA VICTORY PRE RELEASE EVENT TODAY from 5:30PM onwards at SHILPAKALA VEDIKA, Hyderabad 💥
— https://t.co/AWG1DtNksz #MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026.… pic.twitter.com/dZsdpgADPF
— Shine Screens (@Shine_Screens) January 7, 2026

