Allu Arjun: హీరోలు నటుడిగా వాళ్లను వారు నిరూపించుకోవడానికి అనేక పాత్రలు వేస్తుంటారు. అయితే అందులో కొన్ని మంచి పాత్రలు కూడా ఉంటాయి. అలా చేసిన ప్రతి సినిమా కూడా ఆడుతుందనే నమ్మకం కూడా లేదు. అయితే అలాంటి సినిమాలు హిట్ అయితే ఆ హీరోలు మంచి పేరు తెచ్చుకుంటారు. ఫ్లాప్ అయితే మాత్రం వారి బాధ వర్ణనాతీతం ఎందుకంటే అప్పటి వరకూ ఉన్న స్టార్డమ్ ఒక్క సారిగా పడిపోతుంది. ఏం చేయాలోకూడా తోచదు వారికి. అలాంటి సందర్భంలో కొంత మంది హీరోలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే అలాంటి పరిస్థితులు వచ్చినపుడు ఎలా ఉండాలి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది కొంత మందికి మాత్రమే తెలుస్తుంది. అందులో ప్రథముడు అల్లు అర్జున్. ఎందుకంటే ఒక ప్లాప్ వచ్చినపుడు అసలు ఆ సినిమా గురించి ఆలోచించరు చాలామంది హీరోలు. అదే అల్లు అర్జున్ అయితే.. దాని గురించి ఏకంగా నెల రోజులు ఎందుకు ఫ్లాప్ అయింది అని రీసెర్చ్ చెస్తారట. దీని గురించి ప్రొడ్యూసర్ బన్నీవాస్ చెబుతూ ఫ్యాన్స్ అందరినీ ఆశ్యర్య పరిచారు. ప్లాప్ వచ్చినపుడు అల్లు అర్జున్ ఏం చేసేవారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Read also-NTR viral video: అభిమానులపై సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే?
అంతే కాకుండా అల్లు అర్జున్ గురించి బన్నీ వాస్ మరిన్ని విషయాలు చెప్పుకొచ్చారు. అసలు ఓ సందర్భంలో ఆయన్ను తిట్టుకుంటుంటే నేను పాన్ ఇండియా స్టార్ అవుతా సార్ అంటూ చెప్పుకొచ్చాడని, అన్నట్లు గానే పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చూపిస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా ఆయన సక్సెస్ మొదలైన విధానం గురించి చెబూతూ ఫ్యాన్స్ కు మొత్తం గూస్ బంప్స్ వచ్చేలాగ ఉందంటూ చెప్పుకొచ్చారు. గంగోత్రి సినిమాలో లంగా ఓణీ వేసుకుంటే అందరూ తనపై రకరకాల కామెంట్లు పెట్టారని, ఇప్పుడు అదే విధంగా చీరలో కనిపిస్తే ఈలలు వేశారని ఇదే తన దృష్టిలో పెద్ద ఎచివ్ మెంట్ అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.900 వందల కోట్లు బడ్జెట్ తో రూపొందుతోంది. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. దీనిని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపికా పదుకొణె ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. 2027 ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమవుతున్నారు. దీనిపై పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ అభిమానుల భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను దేశంలోనే అత్యంత ప్రతిస్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి మిరి.

