Kotha Prabhakar Reddy: హైదరాబాద్ నడిబొడ్డున గల దుర్గం చెరువును కబ్జా చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. హైడ్రా (HYDRAA) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాదాపూర్ పోలీసు స్టేషన్ (Madhapur Police Station)లో ఎఫ్ఐర్ రాశారు. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల భూమిని ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఆక్రమించినట్లు హైడ్రా ఆరోపించింది. ఆ భూమిని రాళ్లు, మట్టితో నింపి పార్కింగ్ స్థలాలుగా మార్చారని పేర్కొంది. ఐటీ కంపెనీ వెహికల్స్ కు, ప్రైవేటు బస్సులకు పార్కింగ్ స్థలంగా దానిని వినియోగిస్తూ నెలకూ సుమారు రూ.50 లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులు.. 2014 నుంచి దుర్గం చెరువును కబ్జా చేసినట్లు హైడ్రా తన ఫిర్యాదులో పేర్కొంది. మాదాపూర్ లోని ఇన్ ఆర్బిట్ మాల్ సమీపంలో ఈ ఆక్రమణకు గురైన భూమి ఉన్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. కాగా ఇటీవలే కబ్జాకు గురైన భూమిని క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. ఈ భూమిలో నిర్మాణాలను తొలగించారు. నిబంధనలకు విరుద్దంగా పార్కింగ్ చేసిన వాహనాలను ఖాళీ చేయించారు. అనంతరం ఫెన్సింగ్ వేసి.. హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులు 10-15 మీటర్ల ఎత్తు వరకూ మట్టిని నింపి పార్కింగ్ ఏరియాగా మార్చేశారని ఈ సందర్భంగా అధికారులు ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
దుర్గం చెరువులో మట్టి నింపి, రాళ్లు నింపి అక్రమంగా ప్రైవేటు పార్కింగ్ దందా చేసినందుకు మాదాపూర్ పీఎస్ లో హైడ్రా ఫిర్యాదు
2014 నుంచి దుర్గం చెరువును కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్న హైడ్రా
కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట… pic.twitter.com/Ppr6uIrWpH
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026
Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు
ఇదిలా ఉంటే ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న దుర్గం చెరువు.. ప్రస్తుతం 116 ఎకరాలకు కుచించుకుపోయింది. చెరువుకు ఉత్తర దిశ తప్పితే.. మూడువైపులా ఆక్రమణలకు గురైంది. 1976 నాటికే 29 ఎకరాల వరకూ కబ్జా అయి.. 131.66 ఎకరాలకు మిగిలిపోయింది. 1976వ సంవత్సరం నుంచి 1995 వరకూ భద్రంగానే ఉంది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకూ మరో 10 ఎకరాల మేర కబ్జాకు గురై..121 ఎకరాలకు కుంచించుకుపోయింది. 2000 నుంచి నేటికి మరో 5 ఎకరాలు కబ్జాకు గురయ్యింది.

