Sahithi Infra Scam: ఎట్టకేలకు సాహితీ ఇన్‌ఫ్రా పాపం పండింది. సీసీఎస్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రీ లాంచ్ అంటూ సాహితీ సంస్థ చేసిన స్కాం రూ.3,000 కోట్లుగా తేల్చారు. నాలుగేళ్ల తర్వాత ఛార్జ్‌షీట్ వేసిన పోలీసులు, మొత్తం 64 కేసులు నమోదు చేశారు. వీటన్నింటిపై విచారణ జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
కేసుల వివరాలు
అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్‌కు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు సీసీఎస్ పోలీసులు తెలిపారు. శర్వాణి ఎలైట్ పేరుతో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే, ఇతర ప్రాజెక్టుల్లోనూ కస్టమర్ల నుంచి భారీగా వసూలు చేశారు. అలా వచ్చిన డబ్బులను సాహితీ ఓనర్ లక్ష్మినారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్టు తేల్చారు. ఈ స్కాంలో అతనితోపాటు 13 మందిపై అభియోగాలు నమోదు చేశారు.
Also Read: Land Scam: కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ఎసరు..?
‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేటివ్ కథనాలు
అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ వందల మందిని ముంచిన సాహితీ లక్ష్మినారాయణ బండారాన్ని ‘స్వేచ్ఛ’ ముందే పసిగట్టింది. సాహితీ ఇన్‌ఫ్రా చేపట్టిన ప్రాజెక్టులు, జరిగిన స్కాములు, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇన్వెస్టిగేటివ్ కథనాలను ప్రచురించింది. ఈ స్కాంలో పాత్రధారులు, సూత్రధారుల లింకులనూ బయటపెట్టింది. అయితే, ఇన్నాళ్లకు సీసీఎస్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బు తమకు తిరిగొచ్చేలా చూడాలని వేడుకుంటున్నారు.

