Kodangal News: కొడంగల్లో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ
–త్వరలో పార్టీ విడనున్న మాజీ ఎమ్మెల్యే అనుచరులు
–బీఆర్ఎస్ అధిష్టానం ఒత్తడితోనే లగచర్ల ఘటన
–ఇప్పటికే లగచర్ల సురేష్ రాజీనామా చేస్తానని ప్రకటన
–గౌరారం ఫాంహౌస్లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశం
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వ రథసారథియైన సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్. ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే కంకణంతో సీఎం అడుగులు వేస్తున్నారు. ఉపాధితో పాటు విద్యా, వైద్యం అందుబాటులోకి తీసుకరావాలనే సంకల్పంతో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే భూ సేకరణ సందర్భంగా గత ప్రభుత్వమైన బీఆర్ఎస్, నేడు ప్రతిపక్ష పాత్ర పోషీస్తూ రాజకీయం కోసమే భూ సేకరణను అడ్డుకున్నట్లు స్పష్టమైయింది. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ప్రజలను రెచ్చగోట్టి భూ సేకరణను నిలిపివేయాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. దాంతో దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్లో క్రీయశీలక నేతగా, మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడుగా వ్యవహారిస్తున్న లగచర్ల సురేష్ తో ముందుడి ఆందోళనకు ప్రణాళిక చేశారు. అధిష్టానం అండగా ఉంటుందని నమ్మిన సురేష్ కు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలని సిద్దపడ్డట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బె..
హైదరాబాద్లోని నందినగర్ కేంద్రంగా లగచర్ల ఘటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే డైరెక్షన్తో పేదలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో అమాయకులైన ప్రజలపై కేసుల పెట్టి జైల్ పాలైనారు. అయినప్పటికి మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో విసుగెత్తిన ముఖ్య నాయకులు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గౌరారంలోని ఓ ఫౌమ్ హౌంస్లో మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు కలిసి సమావేశం నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ముకుమూడిగా ఒకేసారి బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే నాయకుల కంటే ప్రజలకు పనిచేసే నేతల వెంట పనిచేయాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మాసిటీ పేరుతో భూ సేకరణ చేయడంతో స్ధానికులు ఇబ్బంది జరుగుతుందనే ఒకే కారణంతో ఆందోళన పాల్గోన్నట్లు లగచర్ల బీఆర్ఎస్ నేతల వివరిస్తున్నారు. కానీ అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశ్యం తమది కాదనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయాత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.
Also Read: Forest Department: తెలంగాణలో పెరుగుతున్న పులుల సంచారం.. ఆ 14 జిల్లాల్లో అడుగు జాడలు!
అభివృద్ధికే మా మద్దతు..
రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గాన్ని మోడల్ ప్రాంతంగా తిర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ ప్రాంతాల్లో తెలంగాణ ఇండస్ట్రీయల్ పేరుతో భూ సేకరణ చేపట్టారు. స్ధానిక ప్రజలకు ఉపాధి కల్పించాలంటే కంపెనీలు ఏర్పాటు చేయాలి. విద్యా, వైద్యం అందించాలంటే అనువైన స్థలాలు కావాలనే ఉద్దేశ్యంతో భూ సేకరణ చేశామని ప్రభుత్వం చెప్పింది. సేకరించిన భూమిలో ఇంటిగ్రేటేడ్ ఎడ్యూకేషన్, క్రీడాలు, కంపెనీలకు కేటాయించి ప్రజలకు అభివృద్ధిని అందించాలనే సంకల్పంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ అభివృద్ధికి నియోజకవర్గ ప్రజల మద్దతు అవసరమని బీఆర్ఎస్ నేతలు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!

