Khammam News: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట(yathala Kunta) గ్రామ శివారులో పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేశారు. 04-01-2026 మధ్యాహ్నం సమయంలో కొసరాజు శ్రీను (Srinu)కు చెందిన పామాయిల్ తోటలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. ఈ దాడిలో కొసరాజు శ్రీనివాసరావు (జలగం నగర్, సత్తుపల్లి) మరియు బత్తుల నాగయ్య (రాజాపురం గ్రామం, అన్నపురెడ్డిపల్లి మండలం)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను గమనించిన వెంటనే బట్టు మధుసూదనరెడ్డి (యాతాలకుంట), ఇండ్ల శ్రీనివాసరావు (రాజాపురం), బాలి (దుద్దే పూడి గ్రామం, వేంసూరు మండలం), బత్తులు వెంకన్న (అన్నపురెడ్డిపల్లి మండలం) అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన వారిలో యాతాలకుంట నూతన ఉపసర్పంచ్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల అధికారుల వైఖరి..
నిందితుల వద్ద నుంచి నగదు మరియు పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారైన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, యాతాలకుంట గ్రామం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు గిరిజనులకే కేటాయించాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి నాన్–ట్రైబల్ వ్యక్తిని ఉపసర్పంచ్‌గా అనుమతించడంపై ఎన్నికల అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపసర్పంచ్ హోదా ధీమాతో తన పంచాయతీ పరిధినే పేకాట అడ్డాగా మార్చుకున్నాడన్న ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు తోడు, ఉపసర్పంచ్ పదవిని రద్దు చేసి గిరిజనులకు కేటాయించాలంటూ కొందరు గ్రామస్తులు డిమాండ్ చేయడం కొసమెరుపుగా మారింది.
Also Read: Charu Sinha: నేరాన్ని అడ్డుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : అదనపు డీజీ చారు సిన్హా!

