Swetcha Effect: పెనుబల్లిలో ప్రభుత్వ భూమికి ఎమ్మార్వో అక్రమ పట్టా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మార్వో(MRO) శ్రీనివాస్ యాదవ్(Srinivas Yadav, చింతగూడెం గ్రామ పరిపాలన అధికారి రవి లపై రెవెన్యూ అధికారులు సస్పెన్షన్ మేటు విధించారు. గత రెండు రోజుల క్రితం స్వేచ్ఛ డైలీ(Swetcha Daily)లో పెనుబల్లిలో ప్రభుత్వ భూమికి అక్రమ పట్టా కలకలం.. ఎమ్మార్వో పై తీవ్ర ఆరోపణలు అనే శీర్షిక కథనం వెలువడింది. ప్రభుత్వ భూమిని అక్రమ పట్టా చేసినందుకుగాను ఎమ్మార్వో సంబంధిత వ్యక్తుల నుంచి రూ. 40 లక్షల లంచం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు..
ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజలు విచారణ చేపట్టి తహసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, చింతగూడెం జిపిఓ రవి(Ravi)లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరోపణలు రుజువు కావడంతో తాసిల్దార్ శ్రీనివాస్ యాదవ్, జిపిఓ రవి ల పై సస్పెన్షన్ వేటు విధించినట్లుగా సమాచారం. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా పట్టా చేయడానికి ప్రయత్నించిన వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. చింతగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 71/3 71/4 లలో ఉన్న మొత్తం మూడు ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం అప్పటికే ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాధీనం చేసుకుంది. 2023 లో అప్పటి ఎంఆర్ఓ రమాదేవి ఈ భూమిని అక్రమ కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది.
Also Read: Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!
రూ. 5.5 కోట్ల విలువ చేసే ఈ భూమి
అప్పట్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూమి హద్దులు కూడా నిర్ధారించి ప్రభుత్వ భూమి సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. భూభారతి(Bhubharati) పోర్టల్లో నమోదు చేసేందుకు చింతగూడెం రెవెన్యూ పరిధిలోని గ్రైండ్ ఫీల్డ్ హైవే ఖమ్మం(Khamma) దేవరపల్లి విజయవాడ భద్రాచలం జాతీయ రహదారులకు అనుకొని ఉండడంతో సుమారు రూ. 5.5 కోట్ల విలువ చేసే ఈ భూమిపై అక్రమార్కులు కన్నేయడంతో ప్రస్తుత ఎమ్మార్వో శ్రీనివాస్ యాదవ్ సుమారు 40 లక్షలు లంచం తీసుకుని ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు అక్రమ పద్ధతుల్లో పట్టా చేసినట్లుగా ఆరోపణ వెల్లువెట్టడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అది కాస్త రుజువు కావడంతో తహసిల్దార్, జిపిఓ లపై సస్పెన్షన్ వేటు వేశారు.
Also Read: Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

