Singareni Tenders: పాలేరులో దుమారం లేపుతున్న కోల్ వివాదం
Singareni Tenders (imagecredit:swetcha)
Political News, ఖమ్మం

Singareni Tenders: పాలేరులో దుమారం లేపుతున్న కోల్ వివాదం.. కన్ఫ్యూజన్‌లో కీలక నేతలు..?

Singareni Tenders: సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్లను లేవనెత్తుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావులు(Harish Rao) సృజన్ రెడ్డి(Srujan Reddy) అనే వ్యక్తిని టార్గెట్ గా చేస్తున్న ఆరోపణలు పాలేరు లో రాజకీయ దుమారం లేపుతున్నాయి. బొగ్గు టెండర్ల వివాదంలో సృజన్ రెడ్డి ‘టార్గెట్’ గా బీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న వివాదంపై ఆ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పందించకపోవడం పట్ల పాలేరు నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది. బొగ్గు టెండర్ల అంశంలో నామమాత్రంగా నే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్(Kandala Upender) అల్లుడు సృజన్ రెడ్డి తెరపైకి వస్తున్నప్పటికీ, తెరవెనక ఉన్నదంతా కందాళ ఉపేందర్ రెడ్డినేనన్న వ్యాఖ్యలు ఇక్కడ బాగానే వినిపిస్తున్నాయి. స్వతహాగా సింగరేణిలో సివిల్ కాంట్రాక్టర్ అయినటువంటి కందాళ ఉపేందర్ రెడ్డి పొలిటికల్ గా పాలేరు కాంగ్రెస్‌లో ఎంట్రీ కొట్టడానికి ముందునుండే సింగరేణి సంస్థలో పేరెన్నికగన్న కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న అనుభవం ఉన్న వాళ్లలో ఒకరట.

కందాళ కన్ఫ్యూజన్.. నోరు మెదపని వైనం

అయితే తాజాగా బిఆర్ఎస్ టాప్ ఆర్డర్ నేతలతో పాటు , కల్వకుంట్ల కవిత(Kavitha)లు బొగ్గు బ్లాకుల టెండర్ల వివాదంలో సదరు కందాల ఉపేందర్ రెడ్డి బిడ్డ నిచ్చిన అల్లుడు సృజన్ రెడ్డి ‘టార్గెట్’ గా చేస్తున్న వివాదంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పందించకపోవడంతో పాలేరు నియోజకవర్గంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ జోరుగా సాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిచయం అక్కర లేని వ్యక్తి కందాళ ఉపేందర్ రెడ్డి కావడం, ఆయన రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన వ్యక్తి గా కూడా ఉన్నందున రచ్చ బాగానే జరుగుతుంది. తన అల్లుడు సృజన్ రెడ్డి ‘టార్గెట్’గా కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న ఆరోపణలపై కందాళ ఉపేందర్ రెడ్డి నోరు మెదపడం లేదు . మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతారని, పాలేరు నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారనే చర్చకు కూడా ఈ సందర్భంగా తెరలేచింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas reddy) ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వచ్చే ఎన్నికల్లో పొంగులేటి కొత్తగూడెంకు మారితే కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం సాగుతోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో

కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అత్యంత సౌమ్యుడు, మానవీయత నిండిన మనిషిగా పేరుందీ కందాళకు ప్రస్తుతం పాలేరు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిగా ఉన్న ఉపేందర్ రెడ్డి(Upender Reddy) 2009లోనే తొలిసారిగా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి ప్రయత్నించారు. సుజాతనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రద్దవడంతో నాడు వైఎస్ఆర్ రాంరెడ్డి వెంకటరెడ్డిని పాలేరుకు మార్చారు. ఫలితంగా కందాళ ఉపేందర్ రెడ్డి ప్రయత్నాలు అప్పట్లో సక్సెస్ కాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాంరెడ్డి వెంకటరెడ్డి(Ramreddy Venkat Reddy) ఆకస్మికంగా మరణానించడంతో పాలేరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ మార్పులు కందాళ ఉపేందర్ రెడ్డిని ఆహ్వానించాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలేరు నుంచి పోటీచేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Minister Tummala Nageshwa Rao)పై 7,669 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కందాల బీఆర్ఎస్ ఛీఫ్ కేసీఆర్(KCR) సమక్షంలో అప్పటి అధికార పార్టీలో చేరారు. మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ఉపేందర్ రెడ్డి దాదాపు 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా మున్ముందు తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే విధంగా బిఆర్ఎస్ పార్టీ అగ్ర శ్రేణి నాయకులు తన అల్లున్ని ‘టార్గెట్’ గా చేసుకుని చేస్తున్న బొగ్గు టెండర్ల అవినీతి ఆరోపణలపై కందాళ ఉపేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నారని సమాచారం.

Also Read: CI Mahender Reddy: ప్రయాణాలు చేసే వారు.. ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.. సీఐ మహేందర్ రెడ్డి!

రేవంత్ రెడ్డి బామ్మర్ది టార్గెట్‌గా కేటీఆర్, హరీష్ రావు

సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్లలో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని టార్గెట్ గా చేసుకుని సృజన్ రెడ్డిని రేవంత్ రెడ్డి బామ్మర్దిగా పదే పదే ప్రస్తావిస్తున్నారు. సృజన్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చిన్న అల్లుడు. ఉపేందర్ రెడ్డి చిన్న కూతురు దీప్తి రెడ్డి భర్తే సృజన్ రెడ్డి అనే విషయాన్ని కల్వకుంట్ల కవితతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా గుర్తు చేశారు. సృజన్ రెడ్డి అనే వ్యక్తికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టులు ఎక్కువగా దక్కాయని కవితతో పాటుగా భట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయినప్పటికీ అటు కేటీఆర్, ఇటు హరీష్ రావులు సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ‘బామ్మర్ది’ అని పదే వల్లే వేస్తున్నారు.

కందాళ అల్లుడు సృజన్ రెడ్డి టార్గెట్..

ఈ పరిస్థితుల్లో తన సొంత అల్లుడైన సృజన్ రెడ్డిని ‘టార్గెట్’గా చేస్తూ బీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న ఆరోపణలపై అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాత్రం ఎక్కడా పెదవి కదపడం లేదు. అమృత్ టెండర్ల నుంచి ప్రస్తుత సింగరేణి బొగ్గు బ్లాకుల టెండర్ల వరకు సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అంటూ కందాళ ఉపేందర్ రెడ్డి అల్లుడినే ప్రధాన అస్త్రంగా ఎంచుకుని సీఎంపై ఆరోపణలు గుప్పిస్తుండడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం చినికి చినికి గాలి వాన లా మారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుతారని, పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతారనే చర్చకు దారితీసింది. కందాళ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మార్గం సుగమం చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ మితిమీరిన దుష్ప్రచారం కూడా పలు రాజకీయ మలుపులకు దారి తీస్తుందంటున్నారు.

Also Read: CI Mahender Reddy: రాత్రి వేళల్లో అలా చేశారా? ఇక మీ పని అంతే.. అల్లరి మూకలకు తనదైన స్టైల్ లో సీఐ వార్నింగ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?