Edulapuram Municipality: ఖమ్మం జిల్లాలోని ఎదులాపురం మున్సిపాలిటీ(Edulapuram Municipality)లో అధికార పార్టీ తాజాగా నిర్ణయం తీసుకుంది. 32 వార్డులకు గాను 18 వార్డులకు తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసుకుంది. మునిసిపాలిటీ చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguletu Srnivas Reddy) నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు అర్హులైన అభ్యర్థుల జాబితా తయారు చేశారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ అందించేందుకు సిద్ధమయ్యారు. గెలుపే లక్ష్యంగా ఎదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విశేషంగా కృషి చేసేందుకు స్పష్టమైన ప్రణాళికలు రచించుకుంది. ఇప్పటికే ఇక్కడ సిపిఐ పార్టీ సొంతంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు చేసుకుంటోంది.
32 వార్డులకు 18 వార్డుల అభ్యర్థుల ఖరారు
ఎదులాపురం మున్సిపాలిటీకి మొత్తం 32 వార్డులు ఉండగా, అందులో 18 వార్డుల వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసుకుంది. మిగిలిన వార్డులకు కూడా త్రీ లేయర్ సర్వే ప్రకారం వార్డులను అభ్యర్థులకు కేటాయించనుంది. సెకండ్ వార్డ్ జనరల్ వుమెన్ కాగా ఏనుగు స్వరూప, మూడవ వార్డు బీసీ విమెన్ కాగా వెలుగు సైదమ్మ, ఐదవ వార్డు జనరల్ కావడంతో బానోతు నాగేంద్ర ప్రసాద్, ఆరవ వార్డు జనరల్ విమెన్ కావడంతో వేమిరెడ్డి శ్రీదేవి, ఏడవ వార్డ్ జనరల్ కావడంతో బుర్ర మహేష్, ఎనిమిదవ వార్డ్ బిసి ఉమెన్ కావడంతో సంఘని సుశీల, తొమ్మిదవ వార్డు ఎస్సీ కావడంతో కందుకూరి శేషమ్మ, 11 వార్డ్ జనరల్ విమెన్ కావడంతో పేరం వెంకటలక్ష్మి, 12 వార్డ్ బిసి కావడంతో చప్పిడి గోవిందు రావు, 14వ వార్డు జనరల్ కావడంతో తమ్మినేని నవీన్, 15 వార్డ్ జనరల్ ఉమెన్ కావడంతో తమ్మినేని మంగతాయి, 16 వార్డ్ ఎస్సీ కావడంతో ఇనప రాంబాబు, 17వ వార్డు ఎస్సి ఉమెన్ కావడంతో గొడ్డుగొర్ల కృష్ణకుమారి, 19వ వార్డు బీసీ ఉమెన్ కావడంతో మలాడి శిరీష, 23వ వార్డు ఎస్సీ ఉమెన్ కావడంతో పోకబత్తిని అనిత, 24 వ వార్డు ఎస్టీ కావడంతో బానోతు భాస్కర్, 26వ వార్డు ఎస్టి విమెన్ కావడంతో బానోత్ దివ్య, 27వ వార్డు ఎస్టి కావడంతో భూక్య పూల్ చంద్ లకు కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లుగా బి ఫామ్ అందించేందుకు అధికార పార్టీ కసరత్తు చేసింది.
Chiranjeevi Fitness: మెగాస్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలుసా?.. అయ్యబాబోయ్ ఏంటి బాసూ మీరు చేసేది..

