Sreeleela
ఎంటర్‌టైన్మెంట్

Sreeleela: నిశ్చితార్థం కాదు.. విషయమేంటో చెప్పేసిన శ్రీలీల!

Sreeleela: డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీలకు సంబంధించి శనివారం కొన్ని ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫొటోలలో శ్రీలీలను చూసిన వారంతా, ఆమె నిశ్చితార్థం చేసుకుందనేలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. మంచి పీక్ టైమ్‌లో ఉండగా శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి? అని అంతా అవాక్కవుతున్నారు. కచ్చితంగా అవి నిశ్చితార్థం (Engagement) ఫొటోలే అని, ‘బిగ్ డే, కమింగ్ సూన్’ అంటే.. త్వరలోనే ఆమె పెళ్లి వార్త చెప్పనుందనేలా టాక్ మొదలైంది. అయితే ఆమె ఇంటి సాంప్రదాయాలు తెలిసిన వారంతా.. ఇది పెళ్లికి సంబంధించిన వ్యవహారం కాదని చెబుతూనే ఉన్నారు. వారు చెప్పినట్లుగానే ఈ ఫొటోలకు శ్రీలీల వివరణ ఇచ్చి, అందరి అనుమానాలకు చెక్ పెట్టేసింది.

Also Read- Star Hero: చనిపోవాలని ఉంది.. నా చివరి సినిమా అదే.. స్టార్ హీరో సంచలన కామెంట్స్

ఇంతకీ ఆ ఫొటోల గురించి శ్రీలీల ఏమని వివరణ ఇచ్చిందంటే.. ‘‘నా ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి (Sreeleela Pre Birthday Celebrations) సంబంధించిన ఫొటోలవి. వచ్చే నెలలో నా పుట్టినరోజు ఉండగా, ఇంట్లోని వారితో ముందస్తుగానే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్‌ని జరుపుకున్నాం. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ అమ్మే చూసుకున్నారు..’’ అని చెప్పుకొచ్చింది. ఆమె ఇచ్చిన వివరణతో కుర్రాళ్లంతా హ్యాపీగా ఉన్నారు. లేదంటే, అప్పుడే శ్రీలీల పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. మాలాంటి వారి పరిస్థితి ఏమిటనేలా? కొందరు కుర్ర నెటిజన్లు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. శ్రీలీల ఇచ్చిన ఈ వివరణతో.. ఆమె పెళ్లి వార్తలు ఇక ఆగిపోయినట్లే. అయినా, ప్రజంట్ ఉన్న పరిస్థితుల్లో ఆమె పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకుంటారు? టాలీవుడ్‌లో చక్రం తిప్పి, బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమైన శ్రీలీల ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోదని అందరికీ తెలుసు. కానీ ఆమె షేర్ చేసిన ఫొటోలు మాత్రం.. దాదాపు ఆ మూమెంట్ ఇచ్చేశాయి. అందుకే, అంతా శ్రీలీల షాక్ ఇవ్వబోతుంది అంటూ కామెంట్స్ చేయడం మొదలెట్టారు.

Also Read- Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడు సుధీర్ బాబు ఘనమైన నివాళి

శ్రీలీల ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు రానా భార్య మిహిక కూడా హాజరవడం విశేషం. జూన్ 14న ఆమె 24వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా, బాలీవుడ్‌లోనూ ఈ భామకు వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. త్వరలో బాలీవుడ్‌లోనూ శ్రీలీల బిజీ తారగా మారుతుందనేలా అప్పుడే టాక్ కూడా మొదలైంది. అలా బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీలీల నెట్ వర్క్ నడుపుతోంది. మరోవైపు, అసలు ఆమె ఎలా ఇన్ని సినిమాలు చేస్తుందని ఆశ్చర్యపోయే వారు కూడా లేకపోలేదు. ప్రతి రోజూ రెండు మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడం అంటే.. ఇప్పుడున్న హీరోయిన్లలో కేవలం శ్రీలీలకే సాధ్యమన్నట్లుగా ఆమె అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు