Star Hero: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ హీరో ఫామ్ లో లేడు. సినిమాలు కూడా హిట్ అవ్వడం లేదు. వ్యక్తి జీవితంలో కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే, తాజాగా ఈ హీరోకి సంబందించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అసలు, తను ఏ ఉద్దేశంతో అలా మాట్లాడాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్కేసులో కీలక మలుపు.. ప్రశ్నలను సిద్ధం చేస్తున్న అధికారులు!
నాకు సినిమాల్లో నటిస్తుండగానే చనిపోవాలని ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తెలిపారు. మహాభారతం తెరకెక్కించాలన్నది తన కోరిక అని, ఆ సినిమానే చివరిది కావొచ్చని తెలిపారు. ఆ సినిమా చేశాకే ఇంకేమీ లేదనే ఫీలింగ్ కలుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇతను నటించిన ” సీతారే జమీన్ పర్ ” (Sitaare Zameen Par) ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Boys Jeans: జీన్స్‌లను ప్రతిసారీ ఉతకొద్దు.. బయటపడిన షాకింగ్ నిజాలు.. అబ్బాయిలు ఇది మీకోసమే!
ఈ కామెంట్స్ పైన సామాన్యుల నుంచి నెటిజన్స్ వరకు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో పాజిటివ్ కంటే నెగిటివ్ గా చేసిన కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మేము నిన్ను నమ్మము, ఇప్పటి నుంచి నీ సినిమాలు కూడా ఎక్కువగా చూడము, అయిన మహాభారతం తీయాలంటే డెడికేషన్ ఉండాలి. ఆ అర్హత మీకు ఉందా ? వద్దు బాబు మాకు సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టకని కొందరు దారుణంగా మాటలు అంటున్నారు. ప్రతి సినిమా తీసేటప్పుడు ఏదొక సెటిమెంట్ డైలాగ్ కొడతావు. హిందువులను విమర్శించే నువ్వు మా సినిమా ఎలా తీస్తావ్ .. ఇక్కడ ఉండకు నువ్వు అంటూ నెటిజన్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.