Boys Jeans: అబ్బాయిలకు బట్టలు ఉతకడమంటే పెద్ద పని. అందులోనూ జీన్స్‌లను వాష్ చేయాలంటే వారు కింద మీదా పడి ఉతుకుటుంటారు. అలాంటి వాళ్లు దీని గురించి తప్పక తెలుసుకోవాలి.
మిచెల్ డి. గాస్ ఏం చెబుతున్నారంటే..
జీన్స్‌లను అదే పనిగా వాష్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. నిజానికి దీనిని ఎక్కువ సార్లు ఉతికితే ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవుతుంది. అలాగే, వాటి లైఫ్ కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. మరి ఎప్పుడెప్పుడు జీన్స్‌లకు వాష్ చేయాలంటే.. జీన్స్‌లను పది సార్లు వాడిన తర్వాత ఉతికితే సరిపోతుందని చెబుతున్నారు. ఎందుకంటే, దీన్ని స్ట్రాంగ్ మెటీరియల్‌తో డిజైన్ చేస్తారు. అదే పనిగా ఉతుకుతూ ఉంటే కలర్‌తో పాటు నాణ్యతను కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: MLC Kavitha: మనసులో బాధ కక్కేసిన కవిత.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై షాకింగ్ కామెంట్స్!
అలాగే, జీన్స్ ఫిట్‌నెస్ కూడా పోతుందని చెబుతున్నారు. దీనిపై ఏదైనా రంగు కానీ, టీ , కాఫీ పడితే మరకలను వాష్ చేసిన మూడు గంటల పాటు ఎండలో ఉంచితే చాలు. ఇక కొందరైతే జీన్స్ ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఇలా పెట్టడం వలన బ్యాక్టీరియా పోతుందని నమ్ముతారు. ఇక ఇప్పటి నుంచి జీన్స్‌ను ఉతికేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని వాష్ చేయండి.
Also Read: Swetcha Special story: చదువే జీవన గమనాన్ని మార్చుతుంది.. ఎస్పీ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.