Sahithi Infra Scam: రూ.3వేల కోట్లుగా తేలిన సాహితీ స్కాం
Sahithi Infra Scam ( image credit: swetcha twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్

Sahithi Infra Scam: రూ.3వేల కోట్లుగా తేలిన సాహితీ స్కాం.. బాధితులకు న్యాయం ఎప్పుడు?

Sahithi Infra Scam:  రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ ఆఫర్స్ సైబర్ స్కాం కంటే దారుణం. సొంతింటి కల కోసం సామాన్యులు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కూడబెట్టుకుని ఒకేసారి చెల్లిస్తుంటారు. 45 రోజుల్లో చెల్లిస్తే, స్క్వేర్ ఫీట్‌కు రూ.2,100 నుంచి రూ.3 వేలే అంటూ వివిధ కంపెనీలు ఆశలు పుట్టించడతో టెమ్ట్ అవుతుంటారు. అలా 2018 నుంచి 2023 వరకు ప్రీ లాంచ్ స్కాంలు భారీగా జరిగాయి. మార్కెట్‌లో రేట్లు అందనంత దూరంలో ఉన్నందున సామాన్య కుటుంబాలు ఎక్కడ తక్కువగా అపార్ట్‌మెంట్స్ దొరుకుతాయో అక్కడ ఎదురు చూసి, అప్పులు తీసుకొచ్చి ఒకేసారి మొత్తం సొమ్ము అప్పగించారు. ఏళ్లు గడిచినా కంపెనీలు పనులు ప్రారంభించక పోవడంతో తర్వాత దిక్కు తోచని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. సాహితీ సహా అనేక కంపెనీలు కస్టమర్లను నిండా ముంచాయి. ఇలాంటి కేసులపై ‘స్వేచ్ఛ’ అనేక ఇన్వెస్టిగేటివ్ కథనాలు ఇచ్చింది. ముఖ్యంగా సాహితీ స్కాంలో (Sahithi Infra Scam) సూత్రధారులు, పాత్రధారుల బండారాన్ని బయటపెట్టింది. అయితే, విచారణలో జరుగుతున్న ఆలస్యం బాధితులకు న్యాయం జరగడంపై నీలినీడలు కమ్మేస్తున్నది.


సాహితీ స్కాంలో బాధితులకు న్యాయం ఎప్పుడు?

రూ.3,000 కోట్లు వసూలు చేసి ఇష్టానుసారంగా బడా బాబులకు ఖర్చు చేసిన సాహితీ ఎండీ లక్ష్మీనారాయణ కేసులో నాలుగేళ్ల తర్వాత ఛార్జిషీట్ దాఖలైంది. ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయినా, లక్ష్మీనారాయణ కుటుంబం ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో గుర్తించారు కానీ, వారిపై చర్యలు లేవు. ఫైనాన్సర్ సునీల్ అహుజా, సంధ్య శ్రీధర్ రావు లాంటి వాళ్ల దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయని పోలీస్ అధికారులు గుర్తించారు. కానీ, అటు వైపు కేసు విచారణ జరగలేదు. ఇప్పటికే సివిల్ వివాదాల్లో ఉన్న భూములను చూపిస్తున్నారు. పైగా నిషేధిత జాబితాలో ఉంచారు. వాటితో రూ.500 కోట్లు కూడా రావని అంచనా. ఎన్సీఎల్టీకి వెళ్లి ఆ ల్యాండ్స్‌ను సాహితీ లక్ష్మీనారాయణకు తెలిసిన వారే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాటి సొమ్ము రూ.300 కోట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తున్నది. ఇదంతా వైట్ కాలర్ స్కాం కంటే డేంజర్ అని బాధితులు వాపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. న్యాయం కోసం బాధితులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Also Read: Sahithi Infra Scam: సాహితీ ఇన్‌ఫ్రా స్కాం రూ.3,000 కోట్లు.. లెక్క తేల్చిన సీసీఎస్ పోలీసులు!


ఇప్పటి వరకు 15కు పైగా కంపెనీలపై కేసులు

హైదరాబాద్ సీసీఎస్, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ లాంటి స్టేషన్స్‌లో రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రీ లాంచ్ ఆఫర్స్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. బడా కంపెనీలుగా ఉన్నా కొన్ని రియల్ సంస్థలు ఆదిలోనే కాంప్రమైజ్ చేసి కేసులు కాకుండా చేసుకుంటున్నాయి. కాకర్ల శ్రీనివాసరావు జయ గ్రూప్ పేరుతో జయ గోల్డ్ అంటూ ప్రీ లాంచ్‌లో అమ్మకం జరిపారు. రూ.300 కోట్లు వసూలు చేశారు. ఈడీ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గాయత్రీ రియల్ ఎస్టేట్‌కు డబ్బు తరలించినట్లు గుర్తించారు. భువనతేజ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చెక్క వెంకట సుబ్రమణ్యం రూ.200 కోట్లు వసూలు చేసినట్లు సీసీఎస్‌లో కేసు నమోదైంది. అంతకు ముందు ఈఓడబ్ల్యూలో కూడా కేసు నమోదు చేసినా పెద్దగా విచారణ జరగలేదు. ఈడీ అధికారులు గత నెలలో జేపీ భూషన్ రావు, జే రాజ్ కుమార్‌ను అరెస్ట్ అయ్యారు. జేవీ బిల్డర్స్ ఎక్కువ వడ్డీ రిటర్న్స్ ఇస్తామని భూములు ఆశ చూపించి 7000 మంది వద్ద రూ.500 కోట్లు వసూలు చేసిందని కేసులు నమోదు అయ్యాయి. వేలూరి లక్ష్మినారాయణ ఆయన భార్య జ్యోతి హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు. వచ్చిన ఫిర్యాదులు లెక్క వేస్తే రూ.80 కోట్లకు రిసిప్ట్స్ ఉన్నాయి. పోలీసులు అరెస్ట్ చేశారో లేదో ఇంకా క్లారిటీ లేదు.

రామచంద్రారెడ్డి రూ.20 కోట్లు వసూలు

– జేజే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసం చేసి టీ వెంకటరమణ ప్రసాద్, కే వెంకటరత్నంలను అరెస్ట్ చేశారు. కమర్షియల్ స్పేస్‌ను ప్రీ లాంచ్‌లో అమ్మకం జరిపి రూ.30 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైత్రి ప్రాజెక్ట్స్ ఓనర్ జానీ బాషా రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడని కేసు నమోదైంది. ఇతను రూ.100 కోట్ల దాకా మోసం చేశాడు. దీనిపై రెరా నోటీసులు జారీ అయ్యాయి. ఓబిలి ఇన్ఫ్రా పేరుతో పాపన్నగారి రామచంద్రారెడ్డి రూ.20 కోట్లు వసూలు చేశారు. 50 మంది బాధితులు ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. దీంతో రామచంద్రారెడ్డితో పాటు వీబీ గుప్తాను అరెస్ట్ చేశారు. భారతీ బిల్డర్స్ రూ.300 కోట్ల దాకా ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసింది.

రూ.70 కోట్ల దాకా ప్రజల వద్ద నుంచి వసూలు

వడ్డీ వ్యాపారి సునీల్ అహుజా చేతిలో ఇరుక్కుని బాధితులకు న్యాయం చేయలేకపోయింది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు ఎండీ శివరామకృష్ణ, చైర్మన్ డీ నాగరాజు, సీఈఓ టీ నర్సింహారావును అరెస్ట్ చేశారు. ఆర్ హోమ్స్ పేరుతో 600 మంది వద్ద నుంచి రూ.150 కోట్లు వసూలు చేసినట్లు భాస్కర్ గుప్తా ఆయన భార్య సుధారాణిపై ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో డీ శ్రీకాంత్ రూ.70 కోట్ల దాకా ప్రజల వద్ద నుంచి వసూలు చేసి మోసాలకు పాల్పడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు. మరెన్నో మోసాలు. నగరంలో ఎంతోమంది ప్రీ లాంచ్ బాధితులు ఉన్నారు. తక్కువకు వస్తుందని ముందస్తుగా కొనుగోలు చేసి కోలుకోలేని దెబ్బతిన్నారు. కానీ, వారికి న్యాయం జరగడం లేదు. రెరా చట్టం వచ్చినా ఫైన్స్ విధించి చేతులు దులుపుకుంటున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఏండ్లకు ఏండ్లు కేసులు సాగదీస్తున్నారు. ఫలితంగా బాధితులకు న్యాయం జరగడం లేదు.

పోలీసుల దర్యాప్తులో ఆలస్యం

కళ్ల ముందు అన్నీ కనిపిస్తున్నా పోలీసులు రికవరీ చేయడంలో విఫలం అవుతున్నారు. కొద్ది రోజుల్లోనే డబ్బులతో మేనేజ్ చేయడంతో మోసగాళ్లు బయట దర్జాగా తిరుగుతున్నారు. ఏటా రియల్ స్కాం పేరుతో 100 కేసులకు పైగానే నమోదు అవుతున్నాయి. బాధితులు వేల సంఖ్యలో ఉంటున్నారు. కానీ, పోలీసులు ఆలస్యం చేయడం వలన రికవరీ కాకుండా పోవడం, సివిల్ వివాదాలు చుట్టుముట్టడంతో తమకు న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు.

Also Read: Medical Scam: సత్తుపల్లి మెడికల్ దందాలో కదులుతున్న డొంక.. ఒప్పందాల వెనుక ఎవరి పాత్ర ఏమిటి..?

Just In

01

Keesara Police: కీసరలో కత్తుల కలకలం.. దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి!.

Megastar Song: మెగాస్టార్ ‘హుక్ స్టెప్’ ఇరగదీశాడుగా.. ఫుల్ లిరికల్ వీడియో ఎలా ఉందంటే?

KTR: కాంగ్రెస్ హామీలు అమలెప్పుడు? సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్!

Jana Nayagan Postponed: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న విజయ్ దళపతి.. ‘జన నాయగన్’ రిలీజ్ వాయిదా..

Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో సిట్ దారి కరెక్టేనా? మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు!