Mahesh Kumar Goud: మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 8న గాంధీ భవన్‌లో ప్రత్యేకంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అసెంబ్లీలో ఆహ్వానించారు. పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్స్‌పై ఇద్దరు నేతలు సుమారు గంటకు పైగా చర్చించారు.
Also Read: Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్
అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలి
కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం, పేరు మార్చడంపై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నారు ఇటీవల ప్రభుత్వం చేపట్టిన కృష్ణ, గోదావరి జలాల పీపీటీ విషయం ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను సీఎంకు పీసీసీ చీఫ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో డివిజన్, వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి వార్డు, డివిజన్ల నుంచి ఆరుగురి చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన వారిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఇవే అంశాలపై టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు.

