Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి
Mahesh Kumar Goud (imagecredit:twitter)
Political News, Telangana News

Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి(Kishan reddy)కి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ 12 ఏళ్ల పాలనపై, కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై చర్చకు రావాలని కోరారు. కిషన్ రెడ్డి సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినా, 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవన్నారు. కానీ సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

Also Read: Narendra Modi: ల్యాండింగ్ సాధ్యపడక, వెనక్కి వెళ్లిపోయిన ప్రధాని మోదీ హెలికాప్టర్.. కారణం ఏంటంటే?

తెలంగాణపై పక్షపాతం

సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదని హెచ్చరించారు. తెలంగాణ(Telangana)పై అడుగడుగునా వివక్ష చూపిస్తున్న ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం కూడా లేదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నదని, దీనిపై కిషన్ రెడ్డి స్పందించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు(BC Reservastions), మెట్రో రైలు ప్రాజెక్ట్(Metro Rail Project), మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నది నిజం కాదా అంటూ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Also Read: Medaram Jatara: మహిళలకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ఫ్రీ బస్సు..!

Just In

01

Delhi Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ముంబై ఫ్లైట్ ఢిల్లీకి తిరిగి మళ్లింపు

Gold Rates: బిగ్ షాక్.. ఒక్క రోజే అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Gade Innaiah: తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్ట్‌కు కారణాలు అవేనా..?

James Ransone: హాలీవుడ్‌కు తీరని లోటు.. జేమ్స్ రాన్సోన్ 46 ఏళ్ల వయసులో కన్నుమూత

Engineering Fees: ఇంకా విడుదల కాని జీవో.. ఇంజినీరింగ్ ఫీజులపై నో క్లారిటీ!