Medaram Jatara: మేడారం జాతరకు ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని మేడారం జాతరకు నడిపే స్పెషల్ బస్సుల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. దీంతో జాతర వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలోనే రెండో అతిపెద్ద జాతర మేడారం. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతర కొనసాగుతుంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే జాతర కొనసాగుతుంది. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తుంది.
Also Read: Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!
పల్లె వెలుగు బస్సు
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే, జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ(RTC) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహిళలకు ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. అయితే, జాతరకు ఏర్పాటు చేసే స్పెషల్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం కల్పించబోతున్నట్లు సమాచారం. దసరా దీపావళి పండుగలు పురస్కరించుకొని ఆర్టీసీ స్పెషల్ బస్సులోను మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది. అదే నిర్ణయాన్ని మేడారం జాతర కోసం ఏర్పాటు స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఆ ఉచిత సదుపాయం కల్పించాలని భావిస్తుంది. త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read: Harish Rao: రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే యాప్‌లు, మ్యాప్‌లతో డ్రామాలు: హరీష్ రావు

