Hyderabad Police( image CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?

Hyderabad Police: పక్కా సమాచారంతో మహేశ్వరం ఎస్వోటీ అధికారులు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులతో కలిసి రాజస్తాన్ తరలిస్తున్న 6.25 కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ ను అరెస్ట్ (Hyderabad Police) చేశారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఎస్వోటీ అదనపు డీసీపీ మొహమ్మద్ షాకీర్ హుస్సేన్ తో కలిసి వివరాలు వెల్లడించారు.

రాజస్తాన్ వ్యాప్తంగా ఏజెంట్ల

రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన విక్రమ్ విశ్నోయ్ వృత్తి రీత్యా డ్రైవర్. అదే రాష్ట్రానికి చెందిన దేవిలాల్ చాలా రోజులుగా గంజాయి దందా చేస్తున్నాడు. అతని నుంచి గంజాయి కొంటున్న ఆయుబ్ ఖాన్, రాంలాల్ రాజస్తాన్ వ్యాప్తంగా ఏజెంట్లను పెట్టుకొని అమ్ముతున్నారు. ఇక, రాంలాల్ కు చెందిన టాటా అల్ట్రా ట్రక్ తో విక్రమ్ తరచూ ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి వెళ్లి గంజాయి తీస్తున్నాడు.

1,210 కిలోల గంజాయి

ఈ క్రమంలో ఒక్కో ట్రిప్పునకు 5లక్షలు తీసుకుంటున్నాడు. దేవిలాల్ సూచన మేరకు ఇటీవల ఐరన్ లోడ్ తీసుకొని మహారాష్ట్ర నాందేడ్ తీసుకెళ్లాడు. అక్కడ ఐరన్ లోడ్ దించేసి హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత ఖమ్మం వెళ్లి ఖాళీ సిమెంట్ సంచులు కొని మల్కాన్ గిరి చేరుకున్నాడు. అక్కడ 1,210 కిలోల గంజాయి కొని సిమెంట్ బస్తాల్లో నింపుకొన్నాడు. అనంతరం హైదరాబాద్ మీదుగా రాజస్తాన్ బయలుదేరాడు. కాగా, సమాచారం తెలుసుకున్న పోలీసులు కొత్తగూడ చౌరస్తా వద్ద ట్రక్ పట్టుకొని గంజాయి సీజ్ చేశారు. దీంట్లో కీలక పాత్ర వహించిన ఏసీపీ సత్తయ్య, సీఐ రవికుమార్, ఇతర సిబ్బందిని సీపీ సుధీర్ బాబు అభినందించారు.

Also Read: Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

జర్మనీలో భర్త ఆచూకీ కోసం ప్రజావాణిలో మహిళ అర్జీ

కెనడాలో నివాసం ఉంటున్న తనకు చెప్పకుండా జర్మనీకి వెళ్లిపోయిన భర్త ముజమిన్ గులాబ్ నాయక్ ఆచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్ పేట్ కు చెందిన షబానా నస్రిన్ అహ్మద్ సీఎం ప్రజావాణిలో అర్జీ దాఖలు చేశారు. ఈ అంశంపై తక్షణం స్పందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జీ డాక్టర్ జి. చిన్నారెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రికి లేఖ రాశారు.

సమగ్ర దర్యాప్తు చేయాలి

నస్రీన్ కు న్యాయం చేయాలని కోరారు. శేషాద్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎన్నారై విభాగం అధికారులు జర్మనీ, కెనడా ఇండియన్ ఎంబసీలకు, కేంద్ర ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖలకు లేఖ రాశారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ఎన్నారై మహిళా విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను కోరుతూ కూడా జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు లేఖ రాశారు.

ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం అండ

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముజామిల్ తో ఆరెళ్ల క్రితం పెళ్లి జరిగిందని, కెనడా నుంచి ఇండియాకు రావాలంటే తన నాలుగేళ్ల బిడ్డకు ఇండియన్ వీసా సహా పలు డాక్యుమెంట్స్ పై తండ్రి సంతకాలు అవసరం అని, భర్త ఆచూకీ కోసం షబానా నస్రిన్ ఇచ్చిన పవర్ ఆఫ్ ఆటార్నీ ద్వారా తల్లి సెప్టెంబర్ 19న సీఎం ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. చిన్నారెడ్డి తక్షణ స్పందనతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. తెలంగాణ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆమెకు పూర్తి భరోసాను కల్పిస్తూ నస్రీన్ కు న్యాయం చేసేందుకు యావత్ ప్రభుత్వం యంత్రాంగం కృషి చేస్తోంది.

 Also Read: Warangal District: స్థానిక సమరంపై సందిగ్ధంలో ఆశావహులు.. ఇంకేమైనా మార్పులు వచ్చేనా!

Just In

01

Bihar Cabinet: బీహార్‌లో ఖరారైన ‘కేబినెట్ ఫార్ములా’!.. సీఎం ఎవరంటే?

BRS Plans: జూబ్లీహిల్స్ ఫలితంపై 18న గులాబీ నేతల భేటీ.. కేడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు?

Jangaon Road Accident: జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు.. ఇద్దరి మృతి!

Cyber Fraud Alert: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు

AV Ranganath: అక్రమ మార్కింగ్‌ల‌పై చ‌ర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు