Harish Rao: గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమిటీ వేయడం అంటేనే ఏపీ జల దోపిడీకి తలుపులు తెరిచినట్టు అని మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు, కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజం కాదని చెప్పారు. 811 టీఎంసీల్లో 69 శాతం తెలంగాణకు దక్కాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు. కేంద్రం స్పందిస్తే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారని అన్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఫైనల్ అవార్డ్ వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని 28 లేఖలు రాసినట్టు పేర్కొన్నారు.
Also Read: Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది: హరీష్ రావు ఫైర్..!
కృష్ణా జలాల పున:పంపిణీ జరిపిస్తాం
రెండు అపెక్స్ మీటింగ్స్‌లో కేంద్రాన్ని నిలదీశారని వివరించారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున:పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. నిజాన్ని దాచి పెట్టి కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేశారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున:పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేశారని వివరించారు.
ఏడాది 2.80 లక్షల ఎకరాలకు నీళ్లు
ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించిందని ప్రశ్నించారు. అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారని వివరించారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసని అన్నారు. పాలమూరుకు 90 టీఎంసీలకు డీపీఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. రెండేళ్లలో ఒక్క అనుమతి తెచ్చారా అని ప్రశ్నించారు. డీపీఆర్ వెనక్కి వచ్చేలా చేశారని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: Harish Rao on CM Revanth: నాడు ఉద్యమ ద్రోహి.. నేడు నీళ్ల ద్రోహి.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

