Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది
Harish Rao (imagecredit:twitter)
Political News, Telangana News

Harish Rao: ఏపీ జల దోపిడీకి కాంగ్రెస్ తలుపులు తెరిచింది: హరీష్ రావు ఫైర్..!

Harish Rao: గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేదే నిజం అయితే ఢిల్లీ మీటింగ్‌కు ఎందుకెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కమిటీ వేయడం అంటేనే ఏపీ జల దోపిడీకి తలుపులు తెరిచినట్టు అని మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు, కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని అబద్ధాలు ఆడుతున్నారని అన్నారు. కేసీఆర్(KCR) 299 టీఎంసీలకు ఒప్పుకున్నది నిజం కాదని చెప్పారు. 811 టీఎంసీల్లో 69 శాతం తెలంగాణ(Telangana)కు దక్కాలని డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు.

కేసు విత్ డ్రా..

కేంద్రం స్పందిస్తే సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తారని అన్నారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఫైనల్ అవార్డ్ వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరపాలని 28 లేఖలు రాసినట్టు పేర్కొన్నారు. రెండు అపెక్స్ మీటింగ్స్‌లో కేంద్రాన్ని నిలదీశారని వివరించారు. సెక్షన్ 3 ద్వారా కృష్ణా జలాల పున:పంపిణీ జరిపిస్తామనే కేంద్రం హామీ మేరకు కేసు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. నిజాన్ని దాచి పెట్టి కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను సాధించి, ప్రజలకు ఎంత మేలు చేశారో 9 ఏళ్ల పోరాటంతో సెక్షన్ 3 కృష్ణా జలాల పున:పంపిణీ సాధించి అంతటి మేలును తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేశారని వివరించారు.

Also Read: Strange Incident: యూపీలో ఆశ్చర్యం.. 29 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి.. మళ్లీ తిరిగొచ్చాడు!

ఎందుకు క్రాప్ హాలిడే..

ఈ సంవత్సరం జూరాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద 5.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించిందని ప్రశ్నించారు. అదే శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి లోటు లేకుండా ఈ ఏడాది 2.80 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారని వివరించారు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ రైతులకు ఈ విషయం తెలుసని అన్నారు. పాలమూరుకు 90 టీఎంసీలకు డీపీఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. రెండేళ్లలో ఒక్క అనుమతి తెచ్చారా అని ప్రశ్నించారు. డీపీఆర్ వెనక్కి వచ్చేలా చేశారని, ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీశ్ రావు మండిపడ్డారు.

Also Read: Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Just In

01

Telangana Assembly: శాసనసభలో గందరగోళం.. యూరియాపై బీఆర్ఎస్ నిరసన.. మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

Kharif Season: అన్నదాతలకు కలిసిరాని ఖరీఫ్ సీజన్.. ఆర్థికంగా నష్టపోయిన రైతులు

Gold Rates: గోల్డ్ లవర్స్ కి షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!

Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ అప్పుడేనా!.. ఎక్కడంటే?

Tobacco Tax: సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు