Strange Incident: ఉత్తర్ ప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోయాడని భావిస్తున్న వ్యక్తి.. 29 ఏళ్ల తర్వాత కుటుంబానికి వెతుక్కుంటూ తిరిగొచ్చారు. దీంతో ఆ వ్యక్తి (79)ని చూసి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాము చూస్తోంది నిజమేనా అన్నట్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. షాక్ నుంచి తేరుకొని అప్యాయంగా తమ కుటుంబ సభ్యుడ్ని హత్తుకున్నారు.
అసలేం జరిగిందంటే?
ముజాఫర్ నగర్ జిల్లా ఖతౌలి ప్రాంతానికి చెందిన షరీఫ్ అహ్మద్ తన మెుదటి భార్య చనిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ కు చెందిన స్త్రీని రెండో వివాహం చేసుకున్నారు. అనంతరం గ్రామాన్ని విడిచి సుమారు 29 ఏళ్ల క్రితం (1997) బెంగాల్ కు వెళ్లారు. ఆ తర్వాత షరీఫ్ అహ్మాద్ ఆచూకి కనిపెట్టేందుకు ఖతౌలిలోని బంధువులు ఎంతగానో ప్రయత్నించారు. షరీఫ్ రెండో భార్య వద్దకు వెళ్లగా అతడు అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది.
అడ్రస్ వెతుక్కుంటూ..
షరీఫ్ రెండో భార్య ఇచ్చిన మరో అడ్రస్ ను కూడా వెతుక్కుంటూ వెళ్లినప్పటికీ షరీఫ్ ఆచూకి లభించలేదని అతని మేనల్లుడు వసీం అహ్మద్ చెప్పారు. దీంతో అతడు చనిపోయి ఉండొచ్చని తామంతా ఒక అభిప్రాయానికి వచ్చేసినట్లు చెప్పారు. మెుదటి భార్యకు ఉన్న నలుగురు కుమార్తెలు సైతం తమ తండ్రి ఇక లేరని ఒక నిర్ణయానికి వచ్చేశారని అతడు తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల..
అయితే షరీఫ్ అహ్మాద్ (79).. పశ్చిమ బెంగాల్ లోని ఓ మారుమూల గ్రామంలో జీవిస్తునే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు హక్కు పొందేందుకు షరీఫ్ కు కొన్ని పత్రాలు అవసరమయ్యాయి. వాటి కోసం యూపీలోని తన గ్రామాన్ని వెతుక్కుంటూ షరీఫ్ అహ్మద్ వెళ్లారు. అలా 79 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగొచ్చిన షరీఫ్ ను చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
Also Read: Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!
మళ్లీ బెంగాల్‌కు రిటర్న్..
సుదీర్ఘ కాలం తర్వాత కుటుంబానికి కలుసుకున్న షరీఫ్.. తమవారిని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, సోదరుడు, మరికొందరు కుటుంబ సభ్యులు మరణించి వార్త తెలుసుకొని ఆవేదన చెందాడు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కుటుంబాన్ని కలుసుకోవడం మాటల్లో వర్ణించలేకపోతున్నట్లు షరీఫ్ అహ్మద్ అన్నారు. అయితే తనకు అవసరమైన సర్టిఫికేట్స్ తీసుకొని.. షరీఫ్ అహ్మద్ తిరిగి బెంగాల్ లోని మేదినీపూర్ జిల్లాకు మళ్లీ వెళ్లిపోయారు. అక్కడ తనకంటూ మరో కుటుంబం ఉందని ఆయన పేర్కొన్నారు.
#FitIndiaSuperhitBulletin: SIR ने मिला दिया परिवार!.. 28 साल बाद अपने घर लौटा शख्स.. देखिए, यूपी के मुजफ्फरनगर की खबर@Sakshijournalis @ShrutikaIndia #UP #Muzaffarnagar #SIR #WestBengal pic.twitter.com/fPm8FqB5RJ
— Times Now Navbharat (@TNNavbharat) January 1, 2026

