Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మాట ఇచ్చాడంటే నిలబడతాడు అంతే. ఆ విషయం ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించారు. ఇప్పుడు మరోసారి ‘కొన్నిసార్లు ఇచ్చిన మాటను నెరవేర్చడం లేటవ్వవచ్చేమో కానీ, నెరవేర్చడం మాత్రం పక్కా’ అనేలా అప్పుడెప్పుడో నిర్మాత రామ్ తాళ్లూరి (Ram Talluri)కి ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు. న్యూ ఇయర్ స్పెషల్‌గా సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమాను అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమాను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కొన్ని రీమేక్ సినిమాల అనంతరం ‘ఓజీ’ సినిమాను చేసిన పవన్ కళ్యాణ్.. ఆ సినిమాతో రికార్డులను క్రియేట్ చేశారు.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ ‘రాజే యువరాజే’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
మాట నిలబెట్టుకున్న పవర్ స్టార్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పార్ట్ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. ఇతర పాత్రలపై హరీష్ శంకర్ చిత్రీకరణ జరుపుతున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ఏంటి? అనే దానిపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్‌లో పవన్ కళ్యాణ్‌తో లోకేష్ కనగరాజ్ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇవేవీ అధికారిక ప్రకటనకు నోచుకోలేదు కాబట్టి అవి డౌటే. కానీ, ఎప్పుడో రామ్ తాళ్లూరికి ఇచ్చిన మాటకు పవన్ కళ్యాణ్ నిలబడ్డారు.
Also Read- Purushaha: పాపం సప్తగిరి.. ‘పురుష:’ నుంచి హీరోయిన్ హాసిని సుధీర్ ఫస్ట్ లుక్!
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ఇదే..
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చేయాల్సిన లిస్ట్‌లో సురేందర్ రెడ్డి చిత్రం కూడా ఒకటి. కొన్ని కారణాలతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలకు బ్రేక్ వేస్తూ రామ్ తాళ్లూరి ఈ సినిమాను న్యూ ఇయర్ స్పెషల్‌గా ప్రకటించడంతో.. పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఇదేనని ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వైవిధ్యంగా కనిపించనున్నారని, అందుకే ఈ మధ్య పవన్ కళ్యాణ్ అలా కనిపిస్తున్నారనేలా టాక్ నడుస్తుంది. జైత్ర రామా మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ అధికారిక ప్రకటనతో ఎన్నో రూమర్స్‌కు రామ్ తాళ్లూరి బ్రేక్ వేశారు. మొదటగా ఆయన ఈ సినిమాను SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రకటించారు. ఇప్పుడు నూతన బ్యానర్‌లో ఈ మూవీని నిర్మించబోతున్నారు.
With folded hands and a full heart 🙏
My dream begins as Production No.1 under #JaithraRamaMovies 🎥
Named with Love & Blessings by our beloved Power Star (PSPK) ❤️
Teaming up with Surender Reddy & Vakkantham Vamsi
Forever grateful. Forever proud.
This dream project is…
— Ram Talluri (@itsRamTalluri) January 1, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

