The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi), టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపుదిద్దకుని విడుదలకు సిద్దమైన క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా మేకర్స్ ‘రాజే యువరాజే’ (Raje Yuvaraje Song) అంటూ సాగే ఆడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సాంగ్‌కు సంబంధించి క్రిస్మస్ స్పెషల్‌గా.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమోలో ప్రభాస్ క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్‌తో ప్రేయర్ చేయించుకోవడం చూపించారు. ఈ సాంగ్ మంచి లవ్ సాంగ్ అనేది ప్రోమోతోనే అర్థమైంది. ఇప్పుడీ సాంగ్ ఫుల్ ఆడియోను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఎలా ఉందంటే..
Also Read- Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!
పిలిచేటి ప్రియ మోహనుడే
సంగీత దర్శకుడు థమన్ ఈ పాటను మ్యూజిక్ బేస్‌ని హైలెట్ చేస్తూ రూపొందించారు. ఇది మాంటేజ్ సాంగ్‌లా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. అందుకే కేవలం ఆడియోను మాత్రమే మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన ప్రోమోలో వీడియోని చూపించినప్పుడు ఆ విషయం అర్థమైంది. నిధి అగర్వాల్ ఈ సాంగ్‌లో కనిపించనుంది. పాట లిరిక్స్ కూడా చాలా అర్థవంతంగా, మరీ ముఖ్యంగా ప్రేమికులకు స్పెషల్ అనేలా ఉన్నాయి. ‘రాజే యువరాజే.. కొలిచేటి తొలి ప్రేమికుడే.. నన్నే నడిపించేదతడే. రాజే యువరాజే.. పిలిచేటి ప్రియ మోహనుడే.. చేసే ప్రతి చోటా కలడే’ అంటూ కృష్ణ కాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. ఈ పాటను సంగీత దర్శకుడు థమన్‌తో పాటు అద్వితీయ వొజ్జల, బేబి రియా సీపాన ఆలపించారు. ఇందులో ప్రధానంగా మ్యూజిక్కే ఉండటం విశేషం. సంగీత దర్శకుడు ఈ పాటకు అందించిన స్వరాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మొత్తంగా అయితే ఈ పాట, ఈ పాటకు థమన్ అందించిన సాహిత్యం అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తోంది.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది
ఎవర్ గ్రీన్ మూవీ
హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా రిలీజ్ కోసం రెబల్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ జోరు కూడా బాగున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని, లేదంటే నా ఇంటికి వచ్చి అడగండి అంటూ.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి ఇంటి అడ్రస్ చెప్పిన విషయం తెలిసిందే. అంత కాన్ఫిడెంట్‌గా మారుతి అండ్ టీమ్ ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

