Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో!
Bhartha Mahasayulaku Wignyapthi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది

Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), కిషోర్ తిరుమల (Kishore Tirumala) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath), డింపుల్ హయతి (Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతం ప్రమోషన్స్‌లో దుమ్మురేపుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక లెక్క, ఇప్పుడు రాబోయే పాట ‘వామ్మో వాయ్యో’ ఒక లెక్క అనేలా మేకర్స్ హింట్ ఇచ్చేశారు.

Also Read- Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?

వామ్మో వాయ్యో వల్లెంకలో..

బుధవారం ఈ చిత్రంలోని ‘వామ్మో వాయ్యో’ పాటకు సంబంధించిన ప్రోమోని (Vaammo Vaayyo Song Promo) మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే మాస్ మసాలా మాములుగా లేదని అనిపిస్తుంది. ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ ట్రీట్ చూపుతిప్పుకోనివ్వడం లేదంటే.. ఏ రేంజ్‌లో ఈ అందాల భామలు గ్లామర్ ఒలకపోశారో అర్థం చేసుకోవచ్చు. వచ్చింది జస్ట్ ప్రోమోనే.. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత.. ఇక ఎక్కడ విన్నా, ఈ సినిమా గురించే మాట్లాడుకోవడం పక్కా అనేలా ఈ ప్రోమో ఉంది. ఇద్దరు భామలు ఆషికా రంగనాథ్‌, డింపుల్ హయతి అస్సలు అందాల ప్రదర్శనలో వెనుకాడలేదు. అంతగా ఈ ప్రోమో ఆకర్షిస్తోంది. ఇక ఈ భామలిద్దరితో మాస్ మహారాజా దుమ్ము లేపేశాడు. ఇంతకు ముందు ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో తమన్నా, రాశీ ఖన్నాలతో రవితేజ ఇలా కనిపించారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ అదే హుషారుతో రవితేజ కనిపించి, అభిమానులను అలరించారు. ‘వామ్మో వాయ్యో’.. ఫుల్ సాంగ్‌ని జనవరి 2వ తేది సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ఈ ప్రోమోలో తెలిపారు.

Also Read- Anil Ravipudi: శివాజీ వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నారంటే?

ఈసారి క్లాసీ టచ్‌తో

ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బీట్స్ వావ్ అనేలా ఉన్నాయి. ఒక మాస్ సాంగ్‌కు ఏమేం కావాలో అవన్నీ పాటలో ఉన్నాయి. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్ మోత మోగడం ఖాయం. ఈ పాటకు దేవ్ పవెర్ సాహిత్యం అందించగా, స్వాతి రెడ్డి (యుకె) ఆలపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తూ.. యూట్యూబ్‌లో టాప్ 1లో దూసుకెళుతోంది. వరుస ప్లాప్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రవితేజ కూడా ఈసారి క్లాసీ టచ్‌తో అభిమానులను అలరించి, మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోషనల్ కంటెంట్ అయితే, సినిమాపై మంచి అంచనాలనే పెంచింది. చూద్దాం.. మరి మాస్ రాజా జాతకాన్ని ఈ సినిమా ఎలా మారుస్తుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన

Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!

Minister Seethakka: గ్రామాల అభివృద్ధికి.. సీఎం రేవంత్ కృషి.. మంత్రి సీతక్క