Anil Ravipudi: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi), ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) అనే సినిమాను రూపొందించారు. సంక్రాంతి బరిలోకి దిగుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీకి వెళ్లిన అనిల్, అక్కడ విద్యార్థులతో, మీడియాతో ముచ్చటిస్తూ ప్రస్తుత ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన శివాజీ (Sivaji Comments) వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల నటుడు శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై అనిల్ రావిపూడిని ప్రశ్నించగా, ఆయన ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు.
Also Read- Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!
వెంటనే సారీ చెప్పేస్తా
‘‘ఆ కామెంట్స్ చాలా సెన్సిటివ్ అంశానికి సంబంధించినవి. ప్రస్తుతం దీనిపై అందరూ ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యల గురించి నేను ఒక మాట చెబితే, అది నచ్చని వారు నాపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విషయాల్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు’’ అని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో జరిగే ప్రతి విషయంపై స్పందించి, తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నా పని నేను చేసుకుంటూ పోతాను తప్పితే, ఇలాంటి వివాదాలను పట్టించుకోను. ఎవరైనా నా వల్ల బాధపడితే మాత్రం వెంటనే సారీ చెప్పేస్తాను.. అలాంటి మనస్తత్వం నాది’’ అంటూ తన సింప్లిసిటీని చాటుకున్నారు.
Also Read- Allu Aravind: కొడుకుకి సక్సెస్ వస్తే వచ్చే ఆనందం.. నాకంటే బాగా ఎవరికీ తెలియదు!
రివ్యూల మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమా రివ్యూల గురించి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘‘సినిమాను ఆదరించేది ఎప్పుడూ ప్రేక్షకులే. సినిమా రివ్యూలు అనేవి వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. రివ్యూ ఇచ్చే వారిని నేను ఎప్పుడూ తప్పుబట్టను. కానీ నా అంతిమ లక్ష్యం మాత్రం టికెట్ కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడిని అలరించడమే’’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రేక్షకులే సుప్రీం అని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలోనే సినిమాలోని ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్‌ను విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మార్క్ డ్యాన్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎనర్జీ ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

