2026 Assembly Elections: కొత్త సంవత్సరం 2026 నూతన ఉత్సాహంతో ఆరంభమైంది. ప్రపంచవ్యాప్తంగా యువత గ్రాండ్‌గా స్వాగతం పలికారు. మన దేశంలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన వేడుకలు జరిగాయి. తీవ్రమైన చలి వాతావరణం మధ్య కూల్ కూల్‌గా కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వాతావరణం ఫుల్ వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ( 2026 Assembly Elections) జరగనున్నాయి. ఆ జాబితాలో ఏయే రాష్ట్రాలు ఉన్నాయో చూసేద్దాం..
కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు
2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాల జాబితాలో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. 2025లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే సంచలన రీతిలో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. మరి, 2026లోనూ ఎన్డీయే హవా కొనసాగుతుందా?, లేక, ఇండియా కూటమి పుంజుకుంటుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ ఏడాది ఎన్నికల హీట్ ముంబై స్థానిక సంస్థల ఎన్నికలతోనే షురూ కానుంది. జనవరి 15న ముంబై సివిక్ బాడీ ఎలక్షన్ జరగనుంది. దేశంలోనే అత్యంత సంపన్న నగర పాలక సంస్థగా ఉన్న ‘బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్’కు ఎన్నికలు జరగనున్నయి.
మమత బెనర్జీకి పరీక్ష
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఈసారి కచ్చితంగా సీఎం మమతా బెనర్జీని అధికార పీఠం దించుతామని బీజేపీ నాయకులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. దీంతో, ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు మమతా బెనర్జీకి అగ్నీపరీక్షగా మారనున్నాయి. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ పడాలనే మమతా బెనర్జీ ఆశలు నెరవేరాలంటూ ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. లేదంటే, ఇండియా కూటమితో బేరసారాలు చేసేందుకు మమతా బెనర్జీకి అవకాశం ఉండకపోవచ్చంటూ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా కొనసాగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు, కేరళలో బీజేపీ ఎదురితే!
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనపడుతోంది. అయితే, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మరోసారి తీవ్ర నిరాశ తప్పకపోవచ్చని అంటున్నారు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీకి పట్టులేకపోవడంతో ఇతర పార్టీల మధ్య ప్రధానమైన పోటీ ఉండనుంది. తమిళనాడులో అధికార డీఎంకే, ఏఐఏడీఎంకే, విజయ్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఇతర పార్టీలతో జట్టు కట్టి బరిలోకి దిగనున్నాయి.
Read Also- Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి కరాటే దెబ్బలు.. వెధవ అంటూ ఫైర్ అయిన కళ్యాణి..

