Snake Gang Suspect: సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం, అంటే 2016లో హైదరాబాద్‌లోని పాత బస్తీని భయభ్రాంతులకు గురిచేసిన స్నేక్ గ్యాంగ్ గుర్తుందా?. ఆ ముఠాను గుర్తుకొచ్చేలా హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. చాంద్రాయణ గుట్ట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ పట్టుబడ్డాడు. పోలీసులు ఆటోను తమ ఆధీనంలోకి తీసుకోగా, తిరిగి ఇచ్చేయాలంటూ వాదులాటకు దిగాడు. ఆటోలోంచి సడెన్‌గా ఒక పాముని బయటకు తీశాడు. దానితో ట్రాఫిక్ ఎస్సైని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఒక చేతికి పాముని చుట్టుకొని, తన బండిని ఇచ్చేయాలంటూ అటుఇటు తిరిగాడు. అయితే, నిందిత వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2016లో హైదరాబాద్‌లో స్నేక్ గ్యాంగ్ సంచలన నేరాలకు పాల్పడిన విషయం తెలిసిందే. నగరంలోని ఓల్డ్ సిటీలో పాములతో బెదిరించి అమ్మాయిలపై మానభంగాలకు పాల్పడడంతో పాటు దోపిడీలు కూడా చేశారు. దీంతో, తాజాగా కలకలం రేపిన ఈ వ్యక్తి కూడా ‘స్నేక్ గ్యాంగ్’కు చెందిన వాడేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతడికి సంబంధించిన వివరాలన్నింటిపైనా దర్యాప్తు జరపాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆటోలో పాముని ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్యూటీలో ఉన్న ఒక అధికారిని ఈ విధంగా బయటపెట్టడం ఏమిటి?, నిందితుడిని విచారించాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కోరుతూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా, 2016 నాటికి స్నేక్ గ్యాంగ్ దోషులకు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.
Read Also- Buddhavan: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మెరవనున్న బుద్ధవనం.. అందుకు ప్లాన్ ఇదే..!
In a bizarre incident in Chandrayangutta, a drunk driver tried to intimidate traffic police by brandishing a live snake while demanding his vehicle back — bringing back memories of the infamous “Snake Gang.”
چندرائن گٹہ میں حالتِ نشہ میں گاڑی چلاتے ہوئے پکڑا گیا گاڑی ران اپنی… pic.twitter.com/93BTLtzDJB— Nawab Abrar (@nawababrar131) January 3, 2026

