Mahesh Kumar Goud: పేదల బతుకులు బాగు కోసమే ఉపాధి హామీ పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీసుకువచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అన్నారు. మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు..ప్రపంచం గర్వించదగ్గ త్యాగశీలి అని కొనియాడారు. ఉపాధి హామీ చట్టం లో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్రం తప్పుడు చరిత్ర ను రాసే ప్రయత్నం చేస్తుందన్నారు.దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశస్వాతంత్యం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూ లను మరిపించే ప్రయత్నం చేస్తుందన్నారు.
20 ఏళ్ళు గా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం
దేశంలో వలసల నివారణ కోసం ప్రధానమంత్రి, సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం అని కొనియాడారు. పేదలకు ఉపాధి హక్కు ను కల్పించి జీవనోపాధిని కల్పించిందన్నారు. 20 ఏళ్ళు గా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం అని వివరించారు. ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీలే అని వెల్లడించారు. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే రూ.1800 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. సీఎం రేవంత్ విజన్, అనుభవం గల మంత్రి శ్రీధర్ బాబు హయంలో ఐటీ రంగం దూసుకుపోతుందన్నారు.డీ సెంట్రలైజ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రైమ్ పాలసీ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆదిలాబాద్ కి త్వరలో ఎయిర్ పోర్టు రాబోతుందన్నారు. హైదరాబాద్ సమూలంగా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి: మహేష్ కుమార్ గౌడ్
రికార్డు స్థాయిలో లక్ష 75 వేల కోట్ల పెట్టుబడులు
ఆదిలాబాద్ ,మహబూబాద్ లో ఐటీ సెంటర్ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందన్నారు. హైదరాబాద్ యావత్ ప్రపంచంలోని మేటి నగరాలతో పోటీపడబోతుందన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రికార్డు స్థాయిలో లక్ష 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. సావిత్రి బాయి పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ…విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే అని వివరించారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా, భారతదేశ సామాజిక చరిత్రలో ఆమె చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యం గా వివరించారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.

