Poonam Kaur: రామ్ గోపాల్ వర్మలానే పూనమ్ కౌర్ చేసే ట్వీట్స్ కూడా ఒక్కోసారి అర్థం కావు. అసలు విషయం చెప్పకుండా.. ఏవేవో ట్వీట్స్ వేస్తూ, ఆమె వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని టార్గెట్ చేస్తూ ఆమె చేసే ట్వీట్స్ వైరల్ అవడమే కాకుండా, చర్చలకు దారి తీస్తుంటాయి. ఆమె చేసే ట్వీట్స్‌తో పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్‌కు మంచి కంటెంట్ దొరుకుతుంది. ఒక్కోసారి పవన్ కళ్యాణ్‌నే ఆమె అంటుందేమో అనేలా ఆమె ట్వీట్స్ ఉంటాయి. ఈ మధ్య త్రివిక్రమ్ పై ‘మా’కు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని గొడవ గొడవ చేసిన విషయం తెలిసిందే. నిజంగా తనకి అన్యాయం జరిగి ఉంటే, డైరెక్ట్‌గా రంగంలోకి దిగి పోరాడాల్సింది. అలా కాకుండా, ఇన్ డైరెక్ట్‌గా ఆమె టార్గెట్ చేయడంతో, ఆమెపై కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Rim Jim: రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ఫస్ట్ లుక్ చూశారా!
మీడియాకు కౌంటర్
ఈ ఇంటర్వ్యూలో ఆమె మీడియాను టార్గెట్ చేస్తూ, గట్టిగా చురలకు అంటించింది. ఆమె గురించి వచ్చిన ప్రతిసారి కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతుండటం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా పెళ్లి అయిందని, అబార్షన్ చేయించుకుందని, అలాగే రాహుల్ గాంధీ చెయ్యి పట్టుకుని నడవడంపై కూడా రూమర్స్ వ్యాపించాయి. ఈ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్‌కు బ్రేక్ వేసింది పూనమ్ కౌర్. డైరెక్ట్‌గా, స్ట్రయిట్‌గా చెప్పకుండా, ట్రోలర్స్‌కు, మీడియాకు ఎలా తగలాలో అలా కొట్టింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. అసలింతకీ ఆమె ఏం చెప్పారంటే..
Also Read- Prabhas vs Vijay: అక్కడ ప్రభాస్ సినిమాకు నో థియేటర్స్.. ఇక్కడ విజయ్ సినిమాకు మాత్రం..?
ఎఫైర్ అని రాసేస్తారా?
‘‘అవును నాకు పెళ్లయింది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించారు. మీకు తెలుసో లేదో నాకు పిల్లలు కూడా ఉన్నారు. విడాకులు తీసుకుని రాహుల్ గాంధీతో ఎఫైర్ నడుపుతున్నాను. అందుకే అలా చెయ్యి పట్టుకుని నడిచాను. నా విషయాలన్నీ చక్కగా చెప్పిన మీడియాకు థ్యాంక్స్. వాస్తవానికి నాకు పెళ్లి కుదిరింది కానీ, అనుకున్న విధంగా అన్నీ జరగలేదు. నా విషయాలపై నేను కంట్రోల్‌గా ఉంటాను. నా ఫ్యామిలీని కంట్రోల్‌గా ఉంచగలను. కానీ, జనాలను అలా చేయలేను కదా. అది నా చేతుల్లో లేదు. ఒక నేతకు దగ్గరగా ఉంటే.. ఇక ఎఫైర్ అని రాసేస్తారా? నిజంగా నేను ఏదైనా పార్టీకి కనుక మద్దతు ఇచ్చి ఉంటే ఈ రోజు నా లైఫ్ ఇలా అయితే ఉండేది కాదు. రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండే వారికి ఏం కాదు, నాలాంటి వారి గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటాను’’ అని పూనమ్ ఆవేదన వ్యక్తం చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

