Rim Jim: ప్రస్తుతం టాలీవుడ్‌లో రియలిస్టిక్ డ్రామాల ట్రెండ్ నడుస్తోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలియంది కాదు. కంటెంట్ కరెక్ట్‌గా పడితే.. ఇలాంటి సినిమాలు చరిత్రను తిరగరాస్తున్నాయి. ఇప్పుడలాంటి నేపథ్యంలోనే ఓ మూవీ రూపుదిద్దుకుంటోంది. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రిమ్‌జిమ్’ (Rim Jim). ఈ సినిమాకు ‘అస్లీదమ్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. దీంతో అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేటవుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
Also Read- Anil Ravipudi: సెలబ్రేట్ ద మెగాస్టార్.. మెగా రైడ్ ఎలా ఉంటుందో చూస్తారు
స్నేహం, ప్రేమల కలబోతగా..
ఈ చిత్రానికి హేమ సుందర్ (Hema Sunder) దర్శకత్వం వహిస్తున్నారు. 90వ దశకంలోని సామాజిక పరిస్థితులు, ఆనాటి స్నేహం, ప్రేమను ఎంతో సహజంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ టోన్‌తో సాగే ‘గ్యాంగ్‌స్టర్’ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందట. AV సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు హేమ సుందరే కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. అలాగే పాపులర్ నటులు బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ ఇతక కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Also Read- Prabhas vs Vijay: అక్కడ ప్రభాస్ సినిమాకు నో థియేటర్స్.. ఇక్కడ విజయ్ సినిమాకు మాత్రం..?
రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన ఆకర్షణ
ఈ సినిమాకు మరో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj). ఆయన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించడమే కాకుండా, రెండు అద్భుతమైన పాటలను కూడా పాడినట్లుగా మేకర్స్ తెలిపారు. ఆయన ఫస్ట్ లుక్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఆయన పాత్ర, ఆయన ఇందులో పాడిన పాటలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. 90ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, ప్రస్తుత ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. యదార్థ సంఘటనల నేపథ్యం, బలమైన నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కలయికలో వస్తున్న ‘రిమ్‌జిమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

