Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబినేషన్‌లో హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపొందించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. జనవరి 12న సంక్రాంతి స్పెషల్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను తిరుపతిలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..
Also Read- MSG Trailer: మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ ఎలా ఉందంటే..?
అదయితే పక్కా గ్యారెంటీ
‘‘తిరుపతి నాకు సెంటిమెంట్. నా ప్రతి సినిమా ప్రారంభానికి ముందు, రిలీజ్‌కు ఇక్కడకు రావడం అలవాటు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని, ఇక్కడే ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకున్నాం. మెగాస్టార్‌ను నేను ఎలా చూడాలనుకున్నానో, ఎలా చూశానో, నాకు ఎలా ఆయన ఇష్టమో.. నాకు ఆయనలో ఏమేం నచ్చుతాయో.. వాటిపైనే ఫోకస్ పెట్టి కథ రాయడం జరిగింది. అందుకు తగినట్లుగా అన్నీ ఇందులో నింపేశాం. ఇప్పుడు ట్రైలర్‌లో చూసింది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. ఓ రెండు గంటల 35 నిమిషాలు.. ఒకసారి అంతా టైమ్ మిషన్ ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తారు. అదయితే పక్కా గ్యారెంటీ. మెగాస్టార్ ఎప్పుడూ మన పక్కన లీడర్ రాజు, ఆటో జానీ, రాజారామ్ వంటి పాత్రలలో కనిపించినా విపరీతంగా నచ్చుతారు. ఆయన ఎనర్జీ లెవల్స్, టైమింగ్ అన్నీ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. నేను ఆ బేసెస్‌లోనే ఈ శంకర్ వరప్రసాద్‌గారు పాత్రను రాసుకోవడం జరిగింది. పేరు కూడా అదే పెట్టడం జరిగింది. నిజంగా మెగాస్టార్‌లో ఉన్నటువంటి ఫన్ టైమింగ్, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ ఇందులో బాగా చూపించాం. నేను రాసినదానికంటే, ఆయన 100 పర్సంట్ బెటర్‌గా ఇందులో ఇన్వాల్వై చేశారు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.
Also Read- Prabhas vs Vijay: అక్కడ ప్రభాస్ సినిమాకు నో థియేటర్స్.. ఇక్కడ విజయ్ సినిమాకు మాత్రం..?
మెగా రైడ్
టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశారు. వారి గురించి తర్వాత చెబుతాను. భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌ను అందరూ ఎంతగానో సెలబ్రేట్ చేశారు. అన్నీ సాంగ్స్‌ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనేది నా కెరీర్‌లో ఒక స్పెషల్ ఫిల్మ్. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి అది ఎంత సెన్సేషన్ అయిందో.. ఇప్పటికీ మరిచిపోలేదు. నా లక్ష్యం ఒకటే.. సంక్రాంతికి మీ ఇంటికి భోజనానికి వచ్చినట్లుగా రావడం. అలా వచ్చిన నన్ను అంతా ఆత్మీయంగా పలకరించి, ఆశీస్సులు అందిస్తున్నారు. ఇది నా నాలుగో సంక్రాంతి చిత్రం. మళ్లీ మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను. మెగాస్టార్‌ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే, అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ థియేటర్లకు రావాలని కోరుకుంటున్నాను. సెలబ్రేట్ ద మెగాస్టార్. అలాగే విక్టరీ వెంకటేష్‌కు, నయనతారకు ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెగాస్టార్, విక్టరీ.. ఇద్దరూ ఎటువంటి ఈగోలు లేకుండా.. చక్కగా అల్లరి చేశారు. ఇద్దరూ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. మెగాస్టార్ అయితే స్టార్ట్ టు ఎండ్.. మెగా రైడ్ ఉండబోతుంది. అందరూ థియేటర్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి. జనవరి 12న, ఈ సంక్రాంతికి మళ్లీ నవ్వుకుందాం. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

