Sankranti 2026: సంక్రాంతికి రాబోయే సినిమాలకు సంబంధించి ఇప్పుడో విషయం స్పష్టంగా అర్థమవుతోంది. చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం అందరూ గ్లామర్ ప్రదర్శనను బయటకు తీస్తున్నారు. ఆల్రెడీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి వచ్చిన ‘వామ్మో వాయ్యో’ పాటలో అందాల ఆరబోత గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ‘ది రాజా సాబ్’ టీమ్ కూడా ముగ్గురు హీరోయిన్లతో ఉన్న పాట ప్రోమోని వదిలింది. ఫుల్ సాంగ్ జనవరి 5న రాబోతోంది. ఈ పాటలో ముగ్గురు భామలు ఓ రేంజ్ అందాలను ఆరబోసినట్లుగా ప్రోమో తెలియజేస్తుంది. ఇలా చూసుకుంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలన్నీ ఈ పండక్కి గ్లామర్ ట్రీట్‌ని ప్లాన్ చేసినట్లుగా ఓ హింట్ అయితే ఇచ్చేశారు. ‘ది రాజా సాబ్’లో మాత్రం ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో.. గ్లామర్ డోసు కాస్త ఎక్కువే లభించే అవకాశం ఉంది.
Also Read- Poonam Kaur: నాకు పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు.. పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్
వామ్మో వాయ్యో అనాల్సిందే..
సంక్రాంతి లిస్ట్‌ని ఒక్కసారి గమనిస్తే.. ముందుగా ఈ రేసులోకి ‘ది రాజా సాబ్’ చిత్రమే రాబోతోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ ముగ్గురి ప్రదర్శన ఎలా ఉండబోతుందో తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇంకా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గురించి చెప్పేదేముంది. అందులో ఉన్న కంటెంటే ఆ టైపు కంటెంట్ కావడంతో, ఏ స్థాయిలో అందాల ఆరబోత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ‘వామ్మో వాయ్యో’ అనిపించేలానే ఉన్నారు. ఆ తర్వాత శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విషయానికి వస్తే.. ఇందులోనూ కంచులాంటి ఇద్దరు భామలు ఉన్నారు. సంయుక్త మీనన్ గురించి చెప్పేదేముంది. నార్మల్‌గానే గ్లామర్ ట్రీట్‌కి ఆమె రెడీగా ఉంటుంది. ఇక మరో హీరోయిన్ సాక్షికి ఈ మధ్య హిట్ లేదు. తన లేలేత అందాల పదును చూపించే అవకాశమిది కాబట్టి.. ఆమె కూడా తగ్గి ఉండదు.
Also Read- MSG Movie: అనిల్ రావిపూడి పందెం కోడి కాదు.. రెక్కల గుర్రం!
శంకర వరప్రసాద్ గారికి బ్యాడ్ లక్
సంక్రాంతి బరిలో ఉన్న మరో చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఇందులో ఒక్క హీరోయిన్నే కానీ, ఇప్పటి వరకు చెప్పుకున్న ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆమె అందానికి సరిపోదు. అలాంటి అందాలు మీనూ సొంతం. మీనాక్షి చౌదరి ఒక్కటి చాలు ఈ సినిమాకు. అటు తిరిగి, ఇటు తిరిగి ఎటూ లేనిది మాత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’కే. ఇందులో ఉంటానికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. నయనతార పద్దతిగా చీరకట్టుకుని ఇందులో కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు అందాల ప్రదర్శన చేసే స్టేజ్‌లో కూడా లేదు. ఆ స్టేజ్‌ని దాటేసి వచ్చేసింది. మరో భామ కేథరీన్ థ్రెసా ఉంది. ఆమె ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ, తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే ఆమెను నిండుగా కప్పేశారు. సో.. ఎలా చూసినా, గ్లామర్ పరంగా శంకర వరప్రసాద్‌లో అంతగా ట్రీట్ ఉండకపోవచ్చు. కేవలం చిరు, వెంకీ మాత్రమే ఈ సినిమాకున్న బలాలు. ఆఫ్‌కోర్స్.. అనిల్ రావిపూడి సినిమా అనుకోండి. చూద్దాం.. ఈ సంక్రాంతికి అన్ని రకాలుగా ప్రేక్షకులను ఏ సినిమా శాటిస్‌ఫై చేస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

