MSG Movie: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో రూపుదిద్దుకున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి జనవరి 12న థియేటర్లలోకి రాబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో పీక్స్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, పాటలు, పోస్టర్స్ అన్నీ అంచనాలను పెంచేశాయి. మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మూడు సంక్రాంతి పండుగలకు వచ్చి, మూడు హిట్స్ కొట్టిన ఆయన, ఇప్పుడు నాల్గవ సంక్రాంతికి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాటల రచయిత, సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read- Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. పండక్కి పండగే!
రెక్కల గుర్రం పై మెగాస్టార్
ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. నేను కూడా మెగాస్టార్ చిరంజీవివి వీరాభిమానినే. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. అనిల్ రావిపూడిని అందరూ సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేను ఆయనని సంక్రాంతి పందెంకోడి అనను.. రెక్కల గుర్రం అంటాను. ఈసారి ఆ రెక్కల గుర్రం పై మెగాస్టార్ చిరంజీవి ఎక్కారు. ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకు తెలిసి సినిమా మామూలుగా ఉండదు. ట్రైలర్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ఇక ట్రైలరే ఇలా వుంటే.. సినిమా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయం నమోదు చేయడానికి మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. అందరినీ గొప్పగా అలరించబోతున్నారని చెప్పుకొచ్చారు.
Also Read- Rim Jim: రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ఫస్ట్ లుక్ చూశారా!
ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్
నిర్మాత సాహుగారపాటి మాట్లాడుతూ.. ట్రైలర్ అదిరిపోయింది కదా.. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ సంక్రాంతికి మన అనిల్ ఒక హీరోతోనే వచ్చారు. ఈసారి ఇద్దరు హీరోలతో వస్తున్నారు. మనందరం కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూసి పెరిగిన వాళ్ళమే. ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నామో.. అనిల్ అంతే అద్భుతంగా చూపించారు. ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. అంతా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత సుస్మిత కొణిదల మాట్లాడుతూ.. సంక్రాంతికి ట్రీట్ ఎలా ఉండబోతుందో ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. సినిమా మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అనే ఎంతో ఎగ్జయిట్‌మెంట్ ఉంది. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్. విక్టరీ వెంకటేష్, నయనతార అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్ రాబోతుంది. అందరూ కూడా సినిమాని థియేటర్స్‌లో చూడాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

