Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. పండక్కి పండగే!
Akhanda 2 OTT (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. పండక్కి పండగే!

Akhanda 2 OTT: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్రం బాక్సాఫీస్ వద్ద చేసిన హడావుడి ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత కంటే, విడుదలకు ముందు జరిగిన తతంగమే బాగా హైలెట్ అయింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు అనుకున్న టైమ్‌లో ఈ సినిమాను విడుదల చేయలేకపోవడంతో, రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలను జయించి, డిసెంబర్ 5న రావాల్సిన చిత్రాన్ని డిసెంబర్ 12న మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా రిలీజ్ వెనుక చాలా మంది త్యాగం ఉందనే విషయం తెలియంది కాదు. ఇంకో గంటలో ప్రీమియర్ అనగా ఈ సినిమా ఆర్థికపరమైన చిక్కులతో ఆగిపోవడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అలా, ఒక వారం వాయిదా తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని నందమూరి అభిమానులు ఎంతో ఆశపడ్డారు కానీ, వారి ఆశలు నెరవేరలేదు.

Also Read- Rim Jim: రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో గ్యాంగ్‌స్టర్ డ్రామా.. ఫస్ట్ లుక్ చూశారా!

ఓటీటీ స్ట్రీమింగ్ డిటైల్స్

ఈ సినిమా విడుదలైన రోజు మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య మరోసారి శివతాండవమాడారు. కానీ ఎందుకో, ప్రేక్షకులు అంతగా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు రాలేదు. దీంతో ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందుకోలేదు. కాకపోతే నిర్మాతలకు నష్టాలు రాలేదని మాత్రం ఇటీవల బోయపాటి కూడా చెప్పారు. ఇక థియేటర్ల‌కు ఆడియెన్స్ రప్పించడం ఫెయిలైన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ, అధికారికంగా ‘అఖండ 2’ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించింది. జనవరి 9న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో అంతగా సక్సెస్ కొట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీలో ఎలాంటి ఆదరణను రాబడుతుందో చూడాలి.

Also Read- Prabhas vs Vijay: అక్కడ ప్రభాస్ సినిమాకు నో థియేటర్స్.. ఇక్కడ విజయ్ సినిమాకు మాత్రం..?

పండక్కి పండగే..

ఈ సంక్రాంతికి సినిమాల జాతర మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9 నుంచే ఆ సందడి మొదలు కాబోతోంది. సంక్రాంతి అనగానే అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తారు. అందుకే సంక్రాంతి బరిలో నాలుగైదు సినిమాలు దిగుతుంటాయి. బాగుంటే అన్నీ హిట్టయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంక్రాంతికి జనవరి 9 ‘ది రాజా సాబ్’ రూపంలో ప్రభాస్ మొదలెట్టబోతున్నారు. థియేటర్లలో ప్రభాస్ మొదలెడితే.. ఓటీటీలో బాలయ్య స్టార్ట్ చేయబోతున్నాడన్నమాట. మొత్తంగా చూస్తే మాత్రం ఈ పండక్కి సినీ ప్రియులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు. ఊపిరాడనివ్వని విధంగా సినిమాలు ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. చూద్దాం మరి.. సంక్రాంతి సినిమాల జోరు ఎలా ఉంటుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IPL-Bangladesh: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు

Road Safety: పాఠశాల విద్యార్థుల భద్రత డ్రైవర్లదే: ఇన్‌స్పెక్టర్ కంచి వేణు

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

TG Medical Council: మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం.. చిచ్చు పెట్టిన జీవో 229.. అసలు కారణం అదేనా?