Warangal District: రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయినా సందిగ్ధం, ఉత్కంఠ వేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ తీసుకువచ్చిన జీవో పై పై కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అసలు ఎన్నికలు జరుగుతాయా..? నిలిచిపోతాయా..? జరిగిన కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఏంటీ..? అసలు ఈ రిజర్వేషన్లు ఉంటాయా..? ఎన్నికలు జరిగిన కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తె ఎన్నికలు జరిగిన ప్రయోజనం ఉంటుందా..? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసిన ఇదే చర్చ సాగుతుంది.
షెడ్యుల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో జడ్పీటీ(ZPTC)సీ, ఎంపిటిసి(MPTC) ఎన్నికలు రేడు విడతల్లో పూర్తి చేసి వెంటనే మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యుల్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో అన్ని ఏర్పాట్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు రాకుండా నిర్వహించే ఉద్దేశ్యంతో విస్తృతస్థాయిలో చర్చించి రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వని కారణంగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీకి ఇబ్బందులేమీ ఉండవనే న్యాయ నిపుణుల సూచనల మేరకే షెడ్యూల్ జారీ చేసినట్లు తెలుస్తుంది. షెడ్యుల్ ప్రకారం మండల జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు అక్టోబర్ 23న మొదటి విడత, అక్టోబర్ 27 రెండో విడుత నిర్వహించడంతోపాటు సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8న మూడు విడతల్లో ఎన్నికల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
Also Read: Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు
షెడ్యుల్ విడుదల అయిన ఆశావహుల్లో వీడని సందిక్తత
ఒకవైపు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేస్తుండగా మరొకవైపు ఆశావాహుల్లో సందిగ్ధత వేయడం లేదు. న్యాయపరమైన సమస్యలు తలెత్తి రిజర్వేషన్ల ప్రక్రియ పై భవిష్యత్తులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికలు ఏమవుతాయో అనే ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లకు కుదింపు కోసం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉంటాయా లేవా అనే సందిగ్ధత కొనసాగుతుంది.
కనిపించని సందడి
42 శాతం బిసి రిజర్వేషన్ జీవోను ప్రభుత్వం విడుదల చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఎన్నికల నిర్వహణ వాయిదా వేసుకోవాలని సూచించడం. తుది విచారణకు గడువు విధించడం వంటి పరిణామాలు నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన విధంగా ఎన్నికల నిర్వహణ జరిగిన రిజర్వేషన్ కుదింపు జరిగే ప్రమాదం ఉంది అనే ప్రచారంతో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైనప్పటికీ గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించడం లేదు. హైకోర్టు తీర్పు బిసి రిజర్వేషన్లకు ప్రతికూలంగా వస్తే ఇప్పుడు విడుదల చేసిన రిజర్వేషన్లను కుదిస్తారా..? కొనసాగిస్తారా..? బీసీ రిజర్వేషన్ కుదిస్తే తమ పరిస్థితి ఏంటని ఆశావాహులు ఆందోళనలో ఉన్నారు దీంతో ఎన్నికల నగారం మోగినప్పటికీ ఆశావాహుల్లో ఆందోళన కొనసాగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయనే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని ఆశవాహకులు భావిస్తున్నారు.
Also Read: Bathukamma Record: బతుకమ్మకు రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు