Drainage Problem: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు
Drainage Problem (imagecredir:swetcha)
రంగారెడ్డి, హైదరాబాద్

Drainage Problem: రోడ్డుపై ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు.. రోజులు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

Drainage Problem: జిహెచ్ఎంసి పరిధిలోని పూడూర్–కిష్టాపూర్ సర్కిల్‌లో సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రజా ప్రతినిధుల లేమితో అధికారుల పాలన కొనసాగుతుండగా, కాలనీల సమస్యలు ఎక్కడి వద్ద అక్కడే నిలిచిపోతున్నాయి. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధుల పాలన ఉన్నప్పుడు చిన్న సమస్యైనా వెంటనే వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేవారని, ప్రస్తుతం సంబంధిత అధికారులను కలవాలంటే వారు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా జిహెచ్ఎంసి(GHMC) పరిధిలోకి వచ్చిన మేడ్చల్(Medchal), పూడూర్–కిష్టాపూర్ సర్కిళ్లలో సమస్యల తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి, మేడ్చల్, పూడూర్–కిష్టాపూర్ సర్కిళ్లకు ఒకే డిప్యూటీ కమిషనర్ ఉండటంతో ప్రజలు తమ సమస్యలు వివరించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు.. ప్రజల ఆరోగ్యంపై ముప్పు

పూడూర్–కిష్టాపూర్ సర్కిల్ పరిధిలోని వెంకట రమణయ్య కాలనీ(Venkata Ramanaiah Colony)లో గత మూడు రోజులుగా డ్రైనేజీ నీరు(Drainage water) పొంగిపొర్లి రోడ్లపై ప్రవహిస్తోంది. కాలనీలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను దుర్గంధం వేధిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పారిశుద్ధ్య సిబ్బంది స్పందించకపోవడమే ఈ దుస్థితికి కారణమని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా డ్రైనేజీ సమస్య ఉన్నా ఇప్పటివరకు అధికారులు గానీ, సిబ్బంది గానీ పరిశీలనకు రాకపోవడం దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

అంటువ్యాధులు వస్తే బాధ్యత ఎవరిది?

వెంకట రమణయ్య కాలనీ వాసి విజయలక్ష్మి(Vijayalaxmi) మాట్లాడుతూ, “రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటం సిగ్గుచేటు. చిన్నపిల్లలు తిరిగే ప్రాంతాల్లో ఇలా మురుగు నీరు ఉంటే అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. అప్పుడు బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు లేకపోవడం, అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

Also Read: Anvesh Controversy: గరికిపాటిపై రెచ్చిపోయిన యూట్యూబర్ అన్వేష్.. ఏయ్ జూడ్ నెక్స్ట్ నువ్వే..

Just In

01

IPL-Bangladesh: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు

Road Safety: పాఠశాల విద్యార్థుల భద్రత డ్రైవర్లదే: ఇన్‌స్పెక్టర్ కంచి వేణు

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

TG Medical Council: మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం.. చిచ్చు పెట్టిన జీవో 229.. అసలు కారణం అదేనా?