Shivaji Controversy: తెలుగు రాష్ట్రాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతున్నాయో తెలిసింది. హీరోయిన్ల దుస్తులపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు తెలిపారు. తాజాగా ఇదే విషయంపై హీరో సుమన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో దీని గురించి యాంకర్ అడగ్గా.. శివాజీ అలా అనడం అయితే తప్పే అని, అది ఏధో మాటల సందర్భంలో వచ్చేసి ఉండవచ్చని, తప్పు తెలుసుకుని శివాజీ ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారని చెప్పుకొచ్చారు. దీంతో ఆ విషయం అక్కడకు వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అదే విధంగా సెన్సార్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి విషయంలోనూ సెన్సార్ అవసరం అని, ప్రస్తుతం అది ఫెయిల్ అయిందని, అసలు అది లేకపోతే మరీ మంచిది అంటూ చెప్పుకొచ్చారు. అందరి చేతుల్లో ఉంటే మొబైల్ ఫోన్లో కూడా సెన్సార్ లేదు కదా అన్నారు. హీరోయిన్లు వేసుకునే దుస్తులు సినిమాకు మాత్రమే పరిమితం కావాలని, వాటిని రియల్ లైఫ్ లో వేసుకుంటే అంతగా బాగోదని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ వివాదం మరో సారి చర్చల్లోకి వచ్చింది.
Read also-The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?
అప్పట్లో అలా చేసేవారు..
సహజంగా ఐటమ్ నంబర్స్ చాల సినిమాల్లో ఉంటాయి. ప్రతి సినిమాలో మాత్రం కాదు.. ఇటీవల ఓ హీరోయిన్ కర్ణాటక నుంచి వచ్చారు. అమె ఎలా ఉంటుంది మరి, ఆమె ఏమైనా ఎక్స్ పోస్ చేశారా? అంటూ ప్రశ్నించారు. అప్పటి హీరోయిన్లు గురించి మాట్లాడుతూ.. వారు జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కోశాంతి లాంటివారు కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే అలా కనిపించేవారు. రియల్ లైఫ్ లోకి వచ్చేటపుడు చాలా సహజంగా ఉండేవారు. మేకప్ ఏం ఉండేది కాదు. ఇప్పుడు అలా జరగడం లేదు. అప్పుడు వృత్తిని దైవంగా ఉండేవారు. లోపల బయల ఒకే విధంగా సరికాదు. ఎందుకంటే.. ప్రజల్లో చాలా రకాలుగా జనాలు వుంటారు. అందులో చాలా ప్రభావాలు ఉంటాయి. వారు మద్యం, తదితర మత్తు పదార్థాల ప్రభావంతో ఉంటారు. ఆ సమయంలో ఏమైనా జరగవచ్చు.. అందుకు మనమే జాగ్రత్తగా మంచి బట్టలు వేసుకుని బయటకు వెళ్లాలి అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Aadi Saikumar: రెండో సారి తండ్రి అయిన ఆది సాయికుమార్.. బేబీ బాయ్ పిక్స్ వైరల్..

