Aadi Saikumar: ‘శంబాల’ హిట్ తో ఎంతో ఉత్సాహం మీద ఉన్న ఆది సాయికుమార్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. తను రెండో సారి తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదిక గా ప్రకటించారు. దీనిని చూసిన ఆది సాయికుమార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ కు శంబాల రూపంలో మంచి బ్లాక్ బాస్టర్ వచ్చింది. అదే సమయంలో పండంటి మగ బిడ్డ కూడా పుట్టడంతో కుటుంబం మెత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆదీకి శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. ఇప్పటికే ఆది, అరుణ దంపతులకు మొదటి సంతానంగా ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించారు. శంబాల సినిమా హిట్ సాధించడంతో సాయికుమార్ ఆనందానికి అవధులు లేవు. అదే సమయంలో బిడ్డ కూడా జన్మించడంతో కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
Read also-Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
శుభాకాంక్షల వెల్లువ..
సోషల్ మీడియాలో పోస్ట్ చూసిన నెటిజన్లు.. ఇలా కామెంట్లు పెడుతున్నారు. అటు ‘శంబాల’ బ్లాక్ బస్టర్ హిట్, ఇటు ఇంట్లోకి బుజ్జి వారసుడి ఎంట్రీ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఆది అన్న. ఆ బాబు ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్!. అని, శంభాల సినిమా హిట్టు కొట్టావు ఆది అన్న.. హిట్టు కొట్టిన సందర్భంగా దేవుడు నీకు మంచి మగ బిడ్డని ఇచ్చాడు నువ్వు ఎప్పుడు కూడా మంచి సినిమాలు చేస్తూ అందరికీ చేరువ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిని చూసిన ఆది ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి.
శంబాల హిట్..
ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రానికి ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 1న హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వేచి ఉందని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూన ‘శంబాల’ దూసుకుపొతోంది. ఇక అంతే కాకుండా ‘శంబాల’కి ప్రీమియర్లు, డే వన్, రెండో రోజు ఇలా అన్నీ కలిపి చూస్తే మొత్తంగా 5.4 కోట్ల గ్రాస్ వచ్చాయి. ఇది ఇప్పటివరకు దాదాపు 20 కోట్లు రూపాలయాలు వసూలు చేసి శంబాల సినిమా ఆది సాయికుమార్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.
Welcoming our second child It’s a boy ❤️🤗 pic.twitter.com/q16fXtDzJW
— Aadi Saikumar (@iamaadisaikumar) January 3, 2026

