YouTuber Controversy: సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాక్టర్ శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. దీని గురించి రకరకాల వ్యక్తులు వారికి తోచినట్లు స్పందించారు. అయితే ఇప్పుడు ఈ వివాదం ఇద్దరు యూట్యూబర్ల మధ్య పెను దుమారానికి దారితీసింది. ముందుగా ఇదే వివాదం గురించి యూట్యూబర్ అన్వేష్ తెలుగులో ప్రముఖులైన గరికపాటి గురించి, యాక్టర్ శివాజీ గురించి అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అంతే కాకుండా హిందూ దేవతలను తక్కువ చేసి మాట్లాడాడు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. దీనికి ప్రతి స్పందనగా ప్రముఖ యూట్యూబర్ ఏ జూడ్ స్పందించారు. తనకు ఇష్ణమైన హిందూ దేవతలను, కించపరుస్తూ మాట్లాడటంపై ఏజూడ్ తనదైన్ శైలిలో అన్వేష్ పై విరుచుకు పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న అన్వేష్ ఏ జూడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేశాడు. తనను తిడుతూ ఏ జూడ్ విడుదల చేసిన వీడియోను తీయకపోతే తను ఏం చేస్తానో చూస్తువు అంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇది పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఏ జూడ్ వీడియోను డిలేట్ చేశాడు. కానీ ఈ సారి అదే వీడియోను మళ్లీ అప్లోడ్ చేశాడు. దానికి రీ అప్లోడెడ్ అంటూ పోస్ట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
Read also-Dil Diya First Look: చైతన్య రావు ‘దిల్ దియా’ పోస్టర్ చూశారా.. ఆ బోల్డ్ లుక్ ఏంటి భయ్యా..
ఇక నావంతు.. ఏయ్ జూడ్..
వీడియోలో ఏయ్ జూడ్ అన్వేష్ గురించి ఏం అన్నారంటే.. అన్వేష్ కాసుకో ఇప్పటి వరకూ నేను నీకు చెప్పాల్సింది చెప్పా, నువ్వు నా గురించి మట్లాడావు సరే, నా కుటుంబం గురించి నీకు అనవసరం అయినా వచ్చావు. నువ్వు నాపై పెట్టిన ప్రతి గంటకూ నేను వీడియో పెడతా ఇక నీకు మూడిందే. ఇక నా తండ్రి గురించి తీశావు అది మా వ్యక్తిగతం, మా మధ్య మనస్పర్దలు మాత్రమే ఉన్నాయి. మా తమ్ముడు అంటున్నావు నువ్వు చూశావా? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అసలు పద్నాలు గేళ్ల పిల్ల జీవితంతో ఆడుకున్నది నువ్వు, రా చూసుకుందాం. వచ్చే ముందు నీ దగ్గర ఉన్న ఆధారాలతో రా ఏధో గాల్లో చెప్పినట్లు చేయకు. నోటికి ఏది వస్తే అది అడ్డంగా వాగటానకి ఎవరూ సిద్దంగా లేరు. నీ గురించి ఎన్ని చర్చలు జరుగుతున్నాయో ముందు తెలుసుకో. ఒక్క రోజు ఫోక స్ చేస్తేనే నీ గురించి చాలా తెలిశాయి.. ఇంకా చెయ్యమంటావా దానీకి రెడీనే.. రా చూసుకుందాం. అంటూ సవాలు విసిరాడు. అయితే అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి మారి. ఇప్పటికే అన్వేష్ ఇదంతా కావాలని చేస్తున్నాడంటూ కొన్ని ఆడియో మెసేజులు సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతున్నాయి.
Read also-Toxic Heroine Poster: యష్ ‘టాక్సిక్’ నుంచి మరో హీరోయిన్ పోస్టర్ రివీల్..

