Dil Diya First Look: లాలీవుడ్ లో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు కథానాయకుడిగా డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుందని విషయం తెలిసిందే. తాజాగా ఈసినిమా కు సంబంధించి పోస్టర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్ తో రాబోతుంది. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఫస్ట్ లుక్, పోస్టర్‌ను గమనిస్తే.. బట్టలు లేకుండా సొఫాలో బోల్డ్ లుక్ లో సీరియస్‌గా చూస్తున్నాడు. వెనుక నుంచి ప్రొజెక్టర్ లైటింగ్ వస్తోంది. తన చూపుల్లోని ఇంటెన్సిటీ తన పాత్రలోని సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది. చైతన్య రావు ఎప్పుడూ లేని విధంగా ఇలా బోల్డ్ లుక్ అందరినీ ఆశ్యర్యపరుస్తుంది.
Read also-Toxic Heroine Poster: యష్ ‘టాక్సిక్’ నుంచి మరో హీరోయిన్ పోస్టర్ రివీల్..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్స్, సెన్సిబుల్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు క్రాంతి మాధవ్‌గారు.. మరోసారి ‘దిల్ దియా’తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సిద్ధమవుతున్నారు. చైతన్యరావు మదాడిని న్యూ అవతార్‌లో చూడబోతున్నారు. రా ఎమోషన్స్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నాం. ప్రేమ, మమకారం, వైఫల్యం, స్వీయ గౌరవం వంటి ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ లాంగ్వేజ్‌లో దర్శకుడు ఆవిష్కరిస్తున్నారు. ‘దిల్ దియా’ను సమ్మర్‌లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. కె.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చైతన్యరావు మదాడి, ఇరా, సఖి, జెస్సీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రియాస్ చిత్రాస్, ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్ పై విడుదలవుతున్న ఈ సినిమాకు పూర్ణ నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా.. రా- షా (రవి- శశాంక్) ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. పోస్టర్ లొ హీరో బోల్డ్ గా ఉండటంతో సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Here’s the first look poster of my dear friend's @bykranthi 5th film 🔥
WISHING YOU ALL THE LUCK 🤗
CONGRATULATIONS 🎊 Poster is very intriguing and deep 🤝#DILDIYA @IamChaitanyarao @bykranthi @Ira_dayanand @PoornaNaiduProd @phanikalyang @pgvinda @beyondmediapres… pic.twitter.com/4YrwlglagQ— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 3, 2026

