Thalaivar 173: రజనీ కాంత్ ఇప్పటికే ‘జైలర్ 2’ లో బిజీ బిజీ గా ఉన్నారు. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్, రజనీ కాంత్ కలిసి ‘తలైవార్ 173’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు ముందుగా దర్శకుడిగా సుందర్ సి అనుకున్నారు. అధికారికంగా కూడా ప్రకటించారు. ఇది జరిగిన మరుసటి రోజు తలైవార్ 173 నుంచి తప్పుకుంటున్నానంటూ.. సుందర్ సి ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ సినిమాకు దర్శకుడి కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు ‘తలైవార్ 173’ సినిమాకు దర్శకుడు ఖరారు అయ్యాడు. ఈ సినిమాకు శివకార్తకేయన్ డాన్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ. దర్శకుడి పేరుతో కూడిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!
దర్శకుడు ఎమోషన్..
తలైవార్ 173 కి దర్శకత్వం చేసే అవకాశం రావడంతో దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘చాలా మంది చాలా కలలు కంటుంటారు. కానీ వాటిని కొంతమందే నెరవేర్చుకుంటారు. ఈ రోజు నా కల నెరవేరింది. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి రజనీ సార్ తో ఒక ఫోటో దిగితే సరిపోతుంది. ఈ జీవితానికి అనుకుంటే.. ఎకంగా ఆయన సినిమాకే దర్శకత్వం చేసే అవకాశం రావడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం గా భావిస్తున్నాను. ఈ సినిమాకు కమల్ హాసన్, మహేంద్రన్ నిర్మాతలుగా ఉండటం అసలు నా జీవితంలో ఊహించని పెద్ద విజయం. నన్ను నమ్మినందుకు రజనీ కాంత్, కమల్ హాసన్ లకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. నాపై మీరు ఉంచిన ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయనని మాటిస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
Read also-Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్నారు. దర్శకుడిగా సిబి చక్రవర్తి పేరు ఇప్పటికే కన్ఫామ్ చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ మధ్య ఉన్న 50 ఏళ్ల స్నేహానికి గుర్తుగా ఈ సినిమా రాబోతోంది. కమల్ కేవలం నిర్మాతగానే ఉంటారా లేదా అతిథి పాత్రలో కనిపిస్తారా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రజనీకాంత్ తన ప్రస్తుత ప్రాజెక్ట్ జైలర్ 2 పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవి చంద్రన్ ఉండటంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది.
Every HERO has a FAMILY#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @ikamalhaasan @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram
Promo music : in-house pic.twitter.com/8s954ZIHUM
— Turmeric Media (@turmericmediaTM) January 3, 2026

