Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడిని అన్ని దేశాలు తిరుగుతున్నాను అని చెప్పుకుంటూ.. ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు యూట్యూబర్ అన్వేష్. ఇటీవల మహిళల వస్త్రధారణపై, యాక్టర్ శివాజీపై, గరికపాటిపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో తెలిసిందే. తాజాగా సహస్రావధాని అయిన గరికపాటి నరసింహమూర్తిని టార్గెట్ చేస్తూ వీడియో పెట్టాడు. అసలే హిందూ దేవతలపై హిందువులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుంటే మరో సారి ‘గరికపాటిపై యుద్ధం ప్రకటించాను’ అంటూ ఏకంగా వీడియోనే చేసేశాడు. ఇది చూసిన గరికపాటి అభిమానులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read also-Naache Naache Song Promo: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన సాంగ్ ప్రోమో ‘నాచే నాచే’ ఎలా ఉందంటే?
మేము త్రిమూర్తులము..
గరికపాటి నరసింహమూర్తిని టార్గెట్ చేస్తూ వీడియో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్వేష్ తనను తాను సాక్షాత్తు బ్రహ్మదేవునిగా, గరికపాటిని విష్ణుమూర్తిగా, చాగంటి కోటేశ్వరరావు ని శివునిగా అభివర్ణించారు. మనమంతా ఒకటే కుటుంబమని, మనలో మనం యుద్ధం చేసుకోవడం సరైనది కాదని పేర్కొన్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే అన్వేష్ గురించి ఎవరూ మాట్లాడలేదు. కాంట్రవర్సీలు చేయడానికే అన్వేష్ ఇదంతా చేస్తున్నాడని గరికపాటి అభిమానులు మండి పడుతున్నారు. అసలు అన్వేష్ గురించి వారెవరూ మాట్లాడక పోయినా.. అన్వేష్ మాత్రం తనపై యుద్ధం ప్రకటించడానికి గరికపాటి కి ఇంకిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడైన తనతో విష్ణువు యుద్ధం చేయడం సంభవం కాదని, కావాలంటే శివునితో (చాగంటి తో) యుద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.
Read also-Jetlee Glimpse Out: ‘జెట్లీ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. సత్య వేమన పద్యం ఇరగదీశాడుగా..
గరికపాటి క్షమాపణలు చెప్పాలి..
అంతే కాకుండా.. గరికపాటి అష్టావధానం, సహస్రావధానం చేశానని చెప్పుకుంటారని, కానీ తనకు అంతకంటే ఎక్కువ బ్రహ్మజ్ఞానం ఉందని అన్వేష్ వ్యాఖ్యానించారు. ఇది కొంత హాస్యంగా అనిపించినా.. అన్వేష్ ఇదంతా కావాలనే చేస్తున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గరికపాటి రామాయణం చెబితే, తాను మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు ఏవైనా చెప్పగలనని ఆయనకు సవాలు విసిరారు. ఇదంతా ఆ పండితులను రెచ్చగొట్టడానికే చేస్తున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. స్త్రీల దుస్తులు వారి స్వేచ్ఛ గురించి గరికపాటి చేసిన వ్యాఖ్యలను అన్వేష్ తప్పుపట్టారు. ఆడవాళ్లు ఏం కట్టుకుంటే మనకెందుకు అని ప్రశ్నిస్తూ, 60 ఏళ్ల వయస్సులో పరాయి స్త్రీలను చూసి నిగ్రహం కోల్పోకూడదంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారం చేయడం తప్పని, గరికపాటి లాంటి వారు జనం చప్పట్లు చూసి పొంగిపోకుండా, వాస్తవాల గురించి మాట్లాడాలని సూచించారు. చివరిగా.. గరికపాటి గారు చేసిన తప్పులను సరిదిద్దుకుని, స్త్రీ స్వేచ్ఛ విషయంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అన్వేష్ కోరారు. ఇది ఇంకా మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. చివరిలో ఏయ్ జూడ్ తర్వాత నువ్వే కానుకో అంటూ మెసేజ్ చేశాడు.

