Jetlee Glimpse Out: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’ (Jetlee). తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలయ్యాయి. ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన సత్య, ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారుతున్నారు. సత్యకు తన సినిమాలతో మంచి బ్రేక్ ఇచ్చిన రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానపై చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Read also-Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?
ఈ సినిమా ఒక క్రేజీ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తే ఇది విమాన ప్రయాణం లేదా ఏవియేషన్ నేపథ్యంలో సాగే హాస్యభరిత చిత్రమని అర్థమవుతోంది. సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం సురేష్ సారంగం. ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సత్య ఒక విమానం రెక్కపై కూర్చుని కనిపిస్తారు. “నేను ఇకపై కామెడీ చేయను” అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు, ఇది చాలా వ్యంగ్యంగా ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీ గ్లింప్స్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు మత్తు వదలరా సిక్వెన్స్ సినిమాలతో మంచి హిట్లు సాధించాడు. కమెడియన్ సత్య కూడా మంచి ట్రెండింగ్ లో ఉండటంతో ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టకున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also- Jana Nayagan Trailer: విజయ్ దళపతి జననాయకుడు ట్రైలర్ వచ్చేసింది..

