NBK111: బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీకి మార్పులు.. కారణం అదేనా?
NBK111 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

NBK111: బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీకి మార్పులు.. కారణం అదేనా?

NBK111: నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఇటీవల మరో మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కాంబో అనగానే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయి. ఎందుకంటే, బాలయ్య అంటే గోపీచంద్‌కు అంత ఇష్టం. ఒక అభిమాని తను నచ్చిన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంటుంది వీరి కాంబినేషన్. అది ‘వీరసింహారెడ్డి’తోనే నిరూపింతమైంది. ఇప్పుడీ కాంబినేషన్‌లో ఓ చారిత్రాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. కానీ, తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసి, ‘వీరసింహారెడ్డి’ తరహాలోనే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ, టాలీవుడ్‌లో మాత్రం బాగా హైలెట్ అవుతున్నాయి. సడెన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు.. అదేంటంటే..

Also Read- Poonam Kaur: నాకు పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు.. పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్

భారీ మార్పులకు కారణం..

రీసెంట్‌గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ సినిమా అన్ని ఏరియాలలోనూ లాస్‌ ప్రాజెక్ట్‌గానే నిలిచిందంట. అందుకే బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయాలనుకున్న చిత్రానికి భారీ బడ్జెట్ అవసరమని మొదటి నుంచి చెబుతున్నారు. ‘పెద్ది’ నిర్మాత వెంక‌ట స‌తీష్ కిలారు రూ. 150 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు కూడా. కానీ ‘అఖండ 2’ కలెక్షన్స్ చూసి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ బాలయ్యతో అయితే వర్కువుల్ కాదని, దానిని పక్కన పెట్టేసి.. మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని లైన్‌లోకి తెచ్చినట్లుగా టాక్. అందుకే, నయనతారను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినబడుతోంది.

Also Read- MSG Trailer: మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ ఎలా ఉందంటే..?

లిమిటెడ్ బడ్జెట్‌తో

బాలయ్యతో అనుకున్న హిస్టారికల్ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందట. కానీ, ‘అఖండ 2’ ఇచ్చిన షాక్‌తో రిస్క్ చేయడం ఇష్టం లేక, ప్రాజెక్ట్‌నే మార్చేశారని తెలుస్తోంది. బాలయ్యకు సరిపడా ఒక లిమిటెడ్ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నారట. అలాగే నయనతారకు భారీ రెమ్యునరేషన్ ఉండటంతో, ఆమెను కూడా పక్కన పెట్టి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకునే ప్లాన్‌లో ఉన్నారట. టెక్నికల్ టీమ్ కూడా మారుతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే మాత్రం నందమూరి అభిమానులు మరోసారి నిరాశకు లోనవక తప్పదు. చూద్దాం.. ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అప్డేట్ రాబోతుందో. ఇక బాలయ్య నటించిన ‘అఖండ 2’ చిత్రం జనవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sangareddy News: కరెన్సీపై గాంధీ బొమ్మను తొలగించే కుట్రలను తిప్పి కొట్టాలి: ఎంపీ సురేష్ శెట్కర్

Zarina Wahab: డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా! నా దృష్టిలో డార్లింగ్ అంటే..

Yadadri Bhuvanagiri: బ్యాంకు లోన్ ఇప్పిస్తానని సంతకం చేయించుకొని.. కన్నతల్లి భూమిని అమ్ముకున్న కుమారులు

AP TG Water Dispute: పోలవరం నుంచి నీళ్లు మళ్లించకుండా ఏపీని అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ కీలక వాదనలు

MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?