GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్యుపెన్సీ సర్టిఫికెట్లను జారీ చేసే ప్లానింగ్ విభాగం ఆదాయం ఈ సారి పెరిగింది. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 2024 లో వచ్చిన ఆదాయాన్ని 2025 లో వచ్చిన ఆదాయంతో పోల్చితే సుమారు రూ. 158.24 కోట్ల మేరకు పెరిగింది. భవన అనుమతుల ద్వారా 2025లో జనవరి నుంచి డిసెంబర్ వరకు 11,166 నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 2401 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ)లు, 30 లే ఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు జారీ చేశారు. ఇందులో 103 హైరైజ్డ్ భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 1272.36 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 11,855 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 2125 ఓసీలు, జాఈ చేశారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు.. మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్..?
2,401 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ
అలాగే రూ. 1114.24 కోట్లు వచ్చింది. 2025లో 103 హై రైజ్డ్ భవనాలు(బహుళ అంతస్థుల) భవనాలకు అనుమతులు ఇచ్చారు. నాన్ హైరేజ్ భవనాలు సుమారు 2381 వరకున్నాయి. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 69 మాత్రమే ఉంది. ఈ ఏడాది మొత్తం 11,166 భవన నిర్మాణ అనుమతులు, 2,401 ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. 2025లో అనుమతి పొందిన కొన్ని భారీ నివాస ప్రాజెక్టులలో 50 అంతస్థుల వరకు గల భవనాలు ఉన్నాయి. 30 లే ఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 69 హైరేజ్డ్ భవనాలు ఉన్నాయి. నాన్ హైరేజ్డ్ భవనాలు 2329 ఉన్నాయి. వీటిలో భవన నిర్మాణ అనుమతుల్లో అత్యధికంగా 55 అంతస్తులకు రెసిడెన్షియల్ క్యాటగిరీ కింద రెండు భవనాలకు అనుమతులిచ్చినట్లు సమాచారం.
Also Read: GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు

