Hydra: కూకట్‌పల్లి పరిధిలోని 3 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కుల స్థలాలను హైడ్రా ((Hydra) కాపాడింది. కాపాడిన భూమి విలువ రూ. 35 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా అంఛనా వేసింది. భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలో రెండు పార్కులు కబ్జాకు గరయ్యాయని హైడ్రా (Hydra) ప్రజావాణికి అక్కడి స్థానికులు, స్థానిక సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వివిధ శాఖలతో హైడ్రా(Hydra) అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
Also Read: Hydraa: ప్రగతినగర్ చెరువుకు ప్రాణం పోసిన హైడ్రా.. ఆనందంలో స్థానికులు
రెండు పార్కుల చుట్టూ ఫెన్సింగ్
సర్వే నెంబర్లు 197తో పాటు 200లలో 36 ఎకరాలలో భాగ్యనగర్ ఫేజ్- 3 పేరిట హుడా అనుమతి పొందిన లే ఔట్ 1987లో ఏర్పడిందని హడ్రా పేర్కొంది. 357 ప్లాట్లతో ఏర్పడిన ఈ కాలనీలో రెండు పార్కులు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. 2 వేల గజాల పార్కులో సగం వరకూ కబ్జా కాగా, ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కులో వెయ్యి గజాల వరకు ఆక్రమణకు గురైనట్టు పేర్కొంటూ నివేదిక సమర్పించారు. ఈ నివేదిక మేరకు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో ఈ ఆక్రమణలను అధికారులు తొలగించారు. రెండు పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ప్రాణవాయువును అందించే పార్కులను కాపాడిన హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Hydraa: పతంగుల పండగకు.. చెరువులను సిద్ధం చేయాలి.. హైడ్రా కమిషనర్ ఆదేశాలు

