Aaryan Teaser
ఎంటర్‌టైన్మెంట్

Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

Aaryan Teaser: విష్ణు విశాల్ (Vishnu Vishal) తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయమే. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల‌ భర్తగానే కాకుండా, నటుడిగానూ విష్ణు విశాల్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా మాస్ మహారాజాతో (నిర్మాతగా) సినిమాలు చేస్తూ.. మంచి హిట్స్ కూడా అందుకున్నారు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తర్వాత ‘ఆర్యన్’గా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శుభ్ర, ఆర్యన్ రమేష్‌తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె (Praveen K) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను (Aaryan Teaser) మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాదాపు 34 నెలల విరామం తర్వాత, విష్ణు విశాల్ ఈ శక్తివంతమైన టీజర్‌తో సోలో లీడ్‌గా కం బ్యాక్ ఇస్తున్నట్లుగా చిత్రయూనిట్ కూడా అధికారికంగా ప్రకటించడం విశేషం.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?

అనౌన్స్ చేసిన గంటలోపే హత్య

ఇక టీజర్‌ని గమిస్తే.. ఒక థ్రిల్లింగ్ హత్య దర్యాప్తు, విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ఈ టీజర్.. ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌లోకి తీసుకెళుతుంది. తనదైన శైలిలో విభిన్నమైన పాత్రతో, విష్ణు విశాల్ ఆకట్టుకున్నారు. డార్క్ అండ్ సస్పెన్స్ ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్ ఇస్తుందనేలా, టీజర్ తెలియజేస్తుంది. సాధారణంగా సీరియల్ కిల్లర్స్ వారి సైకలాజికల్ గ్రాటిఫికేషన్ కోసమే హత్యలు చేస్తుంటారు. కానీ, ఇదొక యూనిక్ కేస్. ఇక్కడ కిల్లర్ సైకలాజికల్ కాన్సెప్ట్స్ అన్నింటినీ బ్రేక్ చేశాడని వాయిస్ ఓవర్ చెబుతుండగా, కేసు తీవ్రతను ప్రతి షాట్‌లో చూపించారు. విక్టిమ్ పేరును వాడు పబ్లిక్‌గా అనౌన్స్ చేసిన ఒక గంటలోపే హత్య జరుగుతుంది. ఒకే రోజు వాడి జీవితంలో ఉన్న చిరాకు మొత్తం తీర్చేసుకునే ప్రయత్నం.. అనే డైలాగ్స్ తర్వాత వచ్చే ప్రతి షాట్ చాలా కొత్తగా ఈ సినిమా రూపుదిద్దుకుందనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రధానంగా మ్యూజిక్ మాత్రం హైలెట్ అనేలా ఉంది. ఓవరాల్‌గా అయితే.. లేటయినా, లేటెస్ట్‌గా విష్ణు విశాల్ రాబోతున్నడనే విషయాన్ని ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.

Also Read- Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!

యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌

‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా.. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒక యూనిక్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి, విష్ణు విశాల్ నటించిన FIR చిత్రానికి దర్శకత్వం వహించిన మను ఆనంద్ సహ రచయిత వ్యవహరించడం విశేషం. ‘ఆర్యన్’ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలియజేయడానికి, మేకర్స్ అన్ని రకాల ప్రమోషనల్ ఈవెంట్స్‌ను చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత

Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?

Aaryan Teaser: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ టీజర్ ఎలా ఉందంటే..

Localbody Elections: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు బీజేపీ వ్యూహం ఇదేనా?