Panipuri (Image Source: Twitter)
హైదరాబాద్

Panipuri: రోడ్ సైడ్ పానిపూరి తిని.. 30 రోజులు సిక్ లీవ్ పెట్టిన.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగి!

Panipuri: హైదరాబాద్ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పానిపూరి తిన్న 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్.. హేపటైటిస్ – A బారిన పడ్డాడు. కలుషితమైన నీటిని పానిపూరిలో వాడినందువల్ల తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఆస్టర్ ప్రైమ్ వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో అనారోగ్యం నుంచి బాధితుడు కోలుకున్నాడు. కాబట్టి అపరిశుభ్రమైన చోట విక్రయించే పానిపూరిని నగరవాసులు తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
ఆస్టర్ ప్రైమ్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటిలోని తెల్లటి భాగం, చర్మం పసుపు రంగులోకి మారడం (జాండీస్‌), కడుపు నొప్పి, వాంతులు, వాంతుల భావన, అలసట, గాఢమైన మూత్రం వంటి సమస్యలతో రోగి ఆస్పత్రికి వచ్చాడు. రెండు వారాల క్రితం రోడ్డు పక్కన పానీపూరి, ఫిల్టర్‌ చేయని నీరు తాగిన విషయాన్ని తెలిపాడు. ల్యాబ్‌ పరీక్షల్లో లివర్‌ ఎంజైములు పెరగడం, anti-HAV IgM యాంటీబాడీలు పాజిటివ్‌గా రావడం ద్వారా హేపటైటిస్‌–A అని వైద్యులు నిర్ధారించారు.

వైద్యుల అభిప్రాయం
డాక్టర్‌ కలువల హర్ష తేజా (కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌) మాట్లాడుతూ ‘సాధారణంగా యువతలో హేపటైటిస్‌–A తక్కువ తీవ్రత కలిగి దానంతట అదే తగ్గిపోతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరిగి ఇబ్బంది కలిగించవచ్చు. ఈ కేసు ద్వారా రోడ్డు పక్క ఆహారం తినడం ఎంతటి ప్రమాదకరమైన కాలేయ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందో స్పష్టమవుతోంది’ అని అన్నారు. చికిత్సలో భాగంగా రోగికి హైడ్రేషన్‌, లివర్‌ రక్షణ మందులు, ఆహార నియమాలు, 2–3 వారాల విశ్రాంతిని వైద్యులు సూచించారు. రెగ్యులర్‌ మానిటరింగ్‌తో నాలుగు వారాల్లో పూర్తిగా కోలుకున్నాడు. భవిష్యత్తులో రక్షణ కోసం హేపటైటిస్‌–A టీకా తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.

ప్రజలకు హెచ్చరిక
తరుచూ రోడ్ సైడ్ ఫుడ్ తినేవారికి ఆస్టర్‌ ప్రైమ్‌ వైద్యులు కీలక సూచనలు చేశారు. ‘పానీపూరీ, చట్నీలు, సరిగ్గా వండని నూడుల్స్‌ వంటివి హేపటైటిస్‌ – A & Eకు దారి తీయవచ్చు. ఈ వైరస్‌ ప్రధానంగా ఫీకల్‌–ఓరల్‌ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది. పరిశుభ్రత లేని నగర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చేతులు కడుక్కోవడం, రోడ్డు పక్క ఆహారాన్ని నివారించడం, మరిగించిన/ఫిల్టర్‌ నీరు తాగడం తప్పనిసరి’ అని వైద్యులు తెలియజేసారు.

Also Read: Stray Dogs: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఒకే కుక్క రెండు సార్లు కరిస్తే జీవిత ఖైదు

ఆస్పత్రి సీఈఓ స్పందన
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సీఈఓ డాక్టర్‌ హరి కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ‘భారతదేశంలో హేపటైటిస్‌–A టీకా అందుబాటులో ఉంది. దీన్ని ముఖ్యంగా ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలి. హేపటైటిస్‌ A & E మన దేశంలో నివారించగల ప్రజారోగ్య సమస్యలుగా మిగిలి ఉన్నాయి. శానిటేషన్‌, ఆహార భద్రత, టీకా కవరేజీ పెరగడం ద్వారా ఇలాంటి కేసులు తగ్గుతాయి. పరిశుభ్రత లేని ఆహారం తినడం ఆరోగ్యానికే కాకుండా ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఉద్యోగం చేయలేకపోవడం, చికిత్స ఖర్చులు పెరగడం బాధితులను ఇబ్బంది పెడతాయి’ అని అన్నారు.

Also Read: Viral Video: ఇంటి పనిలో గొడవ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న అత్తా కోడళ్లు.. వీడియో వైరల్

Just In

01

Mega concert 2025: ఏఆర్ రెహమాన్ మెగా కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. పెద్ది సాంగ్ వచ్చేది అప్పుడేనా?..

Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం

EAD Policy: భారతీయులను ఇబ్బందిపెట్టేలా ట్రంప్ మరో నిర్ణయం.. అమెరికాలో ఉన్న మనోళ్ల ఉద్యోగాలకు ముప్పు!

Viral Video: సెలైన్ బాటిల్‌తో వీధుల్లో తిరిగిన రోగి.. అంత అర్జంట్ పని ఏంటో? ఇదిగో వీడియో

Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!