Bhatti Vikramarka: జీసీసీ(గ్లోబల్ కేపబులిటీ సెంటర్) లకు రాజధానిగా హైదరాబాద్ నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సమానత్వంతో కూడిన వృద్ధి, సమిష్టి అభివృద్ధి అనే అంశాలు తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రతిభ పై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ ఒక ప్రతీక అన్నారు. టీ హబ్ సమీపంలో మ్యాక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్ బుధవారం మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మాజీ ప్రధాని నెహ్రూ మొదలుకొని పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మహా నేతలు దూరదృష్టితో చేపట్టిన చర్యలతో హైదరాబాద్ కు మరింత బలం చేకూరిందన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ దూరదృష్టి
కుత్బుమినార్లు, సరస్సులతో ఉన్న చారిత్రక నగరం నుంచి డేటా, డిజైన్, నిర్ణయాల గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉంటే, కేవలం ఒక నగరానికో, దేశానికో కాదు, ప్రపంచానికి సేవ చేయవచ్చు అని హైదరాబాదు నగరం, మాక్ డోనాల్డ్ రెండు నిరూపించాయన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ దూరదృష్టిని మరవలేమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ లో ఉన్న అనువైన ఎకో సిస్టం,ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, పటిష్ఠమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి గొప్ప నిదర్శనం అన్నారు. మా ప్రభుత్వ పనితీరుకు సజీవ సాక్ష్యం అన్నారు. హైదరాబాద్ “గ్లోబల్ జీసీసీ” హబ్ యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు
కేవలం టెక్నాలజీకి సంబంధించిన జీసీసీలు మాత్రమే ఏర్పాటు కావడం లేదన్నారు. అన్ని రంగాలకు చెందిన జీసీసీలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు “తెలంగాణ”వైపు చూస్తున్నాయన్నారు. “రైజింగ్ తెలంగాణ” లక్ష్య సాధనకు మా ప్రభుత్వం ‘మెక్ డొనాల్డ్స్’ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కలిసి పని చేసేందుకు ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో డోనాల్డ్ కంపెనీ ప్రతినిధులు మిస్ స్కై ఆండర్సన్, దేశాంత్ కైలా,మ్యాటిజ్ బ్యాక్స్, స్పీరో ద్రూలియాస్, శదాస్ దాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: మహిళలకు కీలక సందేశం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
