Yadadri Bhuvanagiri: ఉత్త చెత్తే కదా అనుకోకండి. చెత్త కూడా కాసులు కురిపిస్తున్నది. ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి కూడా ఏటా కోట్లలో ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నది తెలంగాణ మున్సిపల్ శాఖ. ఈ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల (డీఆర్సీసీ) ద్వారా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మహిళా స్వయం సహాయక సంఘాలు. పాలసీ (ఎనీూఎస్పీ)లో భువనగిరి మున్సిపాలిటీ ర్యాంకును ప్రవేశపెట్టగా కేంద్ర పట్టాణాభివృద్ధిశాఖ భువనగిరి మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్కు ఎంపిక చేశారు. వనగిరి పట్టణంలో ప్రతి రోజు ఇంటింటికి సేకరించిన తడిచెత్త నెలకు 9 టన్నుల నుంచి 14 టన్నులు వస్తుంది. అదే విధంగా పట్టణంలో పొడిచెత్త 4 టన్నుల నుంచి 5 టన్నుల వరకు వస్తుంది. దీనిని డంపింగ్ యార్డుకు తరలించిన తర్వాత తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తడి చెత్తను మాగబెట్టి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈ ఎరువును పట్టణంలో హరితహారంలో ఏర్పాటు చేసిన మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు.
డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల (డీఆర్సీసీ)
తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘం పొడిచెత్త విక్రయిస్తున్నారు.(ప్లాస్టిక్, కవర్లు, అట్టలు) తో కొంతవరకు ఆదాయం సంపాదిస్తున్నారు. గతంలో రెండుసార్లు భువనగిరి మున్సిపాలిటీలో డీఆర్సీసీ నిర్వాహకులకు ఉత్తమ అవార్డులు సైతం రాష్ట్ర ప్రభుత్వం ,జిల్లా కలెక్టర్ అందజేశారు.
వందరోజుల యాక్షన్ ప్లాన్ పరిశీలనలో
భువనగిరి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను ప్రత్యేక అధికారి (సీడీవో) హేమలత వందరోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పరిశీలించారు. అధికారి మెప్పుకోసం గడువు ముగిసి పనిచేయకున్నా డీఆర్సీసీ నిర్వాహకులను పిలిపించుకొని పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు మున్సిపల్ కమిషనర్ రామలింగం. గతంలో నిర్వహణ సక్రమంగా నిర్వహించారు కాబట్టి మళ్లీ గతంలో చేసిన నిర్వాహకులకు నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని భువనగిరి మున్సిపల్ కమిషనర్ ను ప్రత్యేక అధికారితోపాటు భువనగిరి ఎమ్మెల్యే ఆదేశించారు.
అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండతో
భువనగిరి మున్సిపాలిటీలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి పెత్తనం శృతి మించిపోతుంది. తాను చెప్పిన వారికే టెండర్లు, తానే భువనగిరికి బాస్ అనే విధంగా మున్సిపాలిటీని తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యే అనుచరుడిగా తాను ఏం చేసిన చెల్లుతుంది అనే విధంగా మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు సమాచారం…డీఆర్సీసీ నిర్వహణ ఇవ్వాలంటే తనకు నెలకు కొంత ముట్ట చెప్పాలని లేకపోతే ఇతరులకు కేటాయిస్తామని పేర్కొనడం గమనార్హం.
Also Read: Yadadri Bhuvanagiri: మాతృ మరణాల నివారణపై.. కలెక్టర్ హనుమంత రావు ప్రత్యేక దృష్టి!

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				