Yadadri Bhuvanagiri: రాష్ట్ర స్థాయిలో మెట్ట మొదటి సారిగా వినూత్నంగా జిల్లా యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) కలెక్టర్ హనుమంత రావు తమ జిల్లాలో ఉన్న అటెండర్ నుండి జిల్లా స్థాయి ఉద్యోగస్తుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగ వాణి కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వం లో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకి వ్యక్తిగతంగా గానీ, ఉద్యోగ పరంగా గాని ఏమైనా సమస్యలు ఉంటే వారి దరఖాస్తుల ప్రకారం వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తు నేనున్నాను అనే భరోసా కల్పింస్తు చేపట్టిన ఉద్యోగ వాణి పై ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు . ఉద్యోగ వాణి లో ఉద్యోగులు కొందరు ఇచ్చిన సమస్యలు విని తమ పరిధిలో ఉన్న కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. మరి కొన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలపై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని పై అధికారులు హామీ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
Also Read:Yadadri Bhuvanagiri: మాతృ మరణాల నివారణపై.. కలెక్టర్ హనుమంత రావు ప్రత్యేక దృష్టి!
ఉద్యోగస్తులు ఇచ్చిన వినతుల వివరాలు
చౌటుప్పల్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల శాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న జాహెదా బేగం కి 3 నెలల నుండి పని చేస్తున్న జీతం రావటం లేదని వినతి పత్రం ఇవ్వండంతో వెంటనే సంబధిత అధికారులకు పిలిచి వెంటనే జీతాలు ఇవ్వాలని ఆదేశించిన కలెక్టర్ జిల్లాలో టి స్వాన్ ద్వారా పనిచేస్తున్న 6 గురు సిబ్బందికి 5 నెలల నుండి వేతనాలు రావడం లేదు అని వినతి పత్రం ఇవ్వడంతో వెంటనే రాష్ట్ర స్థాయి లో సంబధిత అధికారులకు ఫోన్ చేసి జీతాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు వెంటనే వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శిలకు జీతాలు రావడం లేదు అని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడంతో వెంటనే రాష్ట్ర స్థాయి లో సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వేతనాలు చెల్లించేలా చూడాలని కోరారు.
Also Read: Yadadri-Bhuvanagiri incident: ప్రమాదానికి కారణమయ్యాడు..జైలుకెళ్ళాడు
